తిరుమల బైపాస్ రోడ్డులో ఓ భవన యజమాని సెట్ బ్యాక్ స్థలం ఆక్రమించి శాశ్వత నిర్మాణం చేపడుతున్నారు. కపిలతీర్థం నుంచి వచ్చే వాహనాలు గరుడ వారధి పైకి, అలానే ఫ్రీ లెఫ్ట్‌కు వెళ్లే ఇరుకై న ప్రాంతంలో ఈ భవనం ఉంది. నిత్యం ట్రాఫిక్ చక్రబంధంలో ఉంటుంది. బస్సు స్టాప్ కూడా ఇక్కడే ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఉన్న కాస్త సెట్ బ్యాక్ స్థలం ఆక్రమణకు గురవడంతో ఇబ్బందులు తప్పవు. పార్కింగ్ సమస్య తలెత్తే అవకాశముంది. గతంలో ఈ సెట్ బ్యాక్ స్థలంలో నిర్మించిన రేకుల షెడ్‌ను సైతం అధికారులు అడ్డుకున్నారు. ఇప్పుడు అక్కడే కూటమి నేతల అండతో శాశ్వత నిర్మాణం చేపడుతున్నా అడిగేవారు కరువయ్యారు. టౌన్ ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. – తిరుపతి తుడా


