రూ.10లక్షల రికవరీకి ఆదేశం | - | Sakshi
Sakshi News home page

రూ.10లక్షల రికవరీకి ఆదేశం

Apr 18 2026 8:23 AM | Updated on Apr 18 2026 8:23 AM

కలువాయి(సైదాపురం): ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతికి సంబంధించి రూ.10లక్షలు రికవరీ చేయాలని నెల్లూరు జిల్లా డ్వామా పీడీ గంగాభవాని ఆదేశించారు. కలువాయి మండలంలోని 20 పంచాయతీల్లో జరిగిన 17వ విడత సామాజిక తనిఖీలకు సంబంధించి కలువాయి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. మండలంలో 1,279 పనులగాను 1201 పనుల్లో రూ.తొమ్మిది కోట్ల విలువైన కూలీల పనులు, రూ. 2.77 కోట్ల మెటిరీయల్‌ పనులు జరిగాయని నెల్లూరు జిల్లా డ్వామా పీడీ గంగాభవాని తెలిపారు. మండలంలో ఉపాధి పనులు అవినీతి పంచాయతీల వారీగా పెన్నబద్వేలు రూ.19,392, బాలాజీరావుపేట రూ. 14,315, చీపినాపిలో రూ.3,600, చినగోపవరం రూ.1,61,756 , చింతలపాళెం రూ.1,84,153, చింతలాత్మకూరు రూ.86,229, దాచూరు రూ.47,722, కలువాయి రూ. 2 వేలు, కనుపూరుపల్లి రూ.2,500, కేశమనేనిపల్లి రూ. 27,087, కుల్లూరు రూ.3,700, ఆదన్నగారిపల్లి రూ.400, నూకనపల్లి రూ.1,502, పల్లకొండ 2,04,028, పెరంకొండ రూ.4,500, తెలుగురాయపురం రూ. 25,398, తోపుగుంట రూ.600, ఉయ్యాలపల్లి 1,83,653 చొప్పున మొత్తం రూ.10 లక్షల మేరకు ఉపాధిలో అవినీతి జరిగినట్లు పీడీ నిర్ధారించారు. ఉపాధిహామీలో జరిగిన అవకతవకలు సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని కారణంతోనే కార్యాలయంలో కూర్చొని ఎంబుక్‌లు నమోదు చేస్తూ కాలయాపన చేస్తున్నారని పీడీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బాలాజీరావుపేటలో సింగిల్‌ జాబ్‌కార్డు వ్యవహారంపై పీడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే కుటుబానికి ఆరు జాబ్‌ కార్డులు ఎలా ఇస్తారని సిబ్బందిని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement