హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు

Apr 18 2026 8:23 AM | Updated on Apr 18 2026 8:23 AM

సత్యవేడు: కుటుంబవిబేధాల కారణంగా జరిగిన హత్యామత్నం కేసులో ముద్దాయి నాగరాజు(39) ఓ టీవీ రిపోర్టర్‌ను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ లావణ్య తెలిపారు. శుక్రవారం సత్యవేడులో పోలీస్‌ స్టేషన్‌లో నిందితుని అరెస్టు వివరాలు ఎస్‌ఐ వెల్లడించారు. సత్యవేడు పంచాయతీ అత్తికాయల వీధిలో అద్దె ఇంట్లో జీ.నాగరాజు నివాసం ఉంటున్నాడు. అత్తామామలతో ఆర్థిక విషయాలపై కొంత కాలంగా విభేదాలు ఉండేవి. మార్చి 27న తన కుమార్తె అనారోగ్యానికి గురికావడంతో కుమార్తెను చూసేందుకు అల్లుడి ఇంటికి అత్త చిత్ర వచ్చింది. అత్త, అల్లుడిని దూషించింది దీంతో ఆగ్రహించిన అల్లుడు అత్తను కట్టెతో తలపై పలుమార్లు కొట్టి గాయపరిచాడు. అమె స్పృహ కోల్పోడంతో చనిపోయిందని భావించి పరారయ్యాడు. ఈ విషయమై మామ ఏ. మురుగున్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్‌ఐలు టి.సాయినాద్‌, బి.లావణ్య దర్యాప్తు చేపట్టారు. వెంకటగిరి కుమ్మరవీధిలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేసి, శుక్రవారం కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement