4 టన్నుల గంజాయి కాల్చివేత | - | Sakshi
Sakshi News home page

4 టన్నుల గంజాయి కాల్చివేత

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గంజాయి విక్రయాల జోరు

విశాఖ నుంచి వచ్చే గంజాయికి కేంద్రంగా రేణిగుంట

పట్టణాల్లోని కళాశాల విద్యార్థులే లక్ష్యంగా విక్రయాలు

తిరుపతి నుంచి చైన్నె, బెంగళూరు, కేరళకు సరఫరా

పల్లెలకు పాకిన గంజాయి విక్రయాలు

రెండేళ్ల వ్యవధిలో నాలుగు డివిజన్లలో 4 టన్నుల గంజాయి స్వాధీనం

రూ.10లక్షల రికవరీకి ఆదేశం
ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతికి సంబంధించి రూ.10లక్షలు రికవరీ చేయాలని డ్వామా పీడీ ఆదేశించారు.

కలెక్టరేట్‌లో స్వీయగణన

జనగణనలో భాగంగా కలెక్టరేట్‌లో ఉద్యోగు లు తమ మొబైల్‌ ఫోన్ల ద్వారా స్వీయగణన కార్యక్రమం చేపట్టారు.

శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

దొరికితేనే దొంగ..లేకపోతే దొర అన్న

చందంగా తిరుపతి, చిత్తూరు జిలాల్లో

గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా

సాగుతోంది. మన్యంలో పండిస్తున్న

గంజాయి ఘాటు జిల్లాను కుదిపేస్తోంది. ఒడిశా సరిహద్దుల్లో సాగు చేస్తున్న గంజాయి విశాఖ నుంచి రేణిగుంటకు చేరవేస్తున్నారు. ఇక్కడి నుంచి తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. దీనికితోడు

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని కళాశాలల్లో విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఈ దందాలో రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. ఇదీ తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గంజాయి గుట్టు.

రేణిగుంట: జిల్లాలో పట్టుబడిన సుమారు 4,100 కిలోల గంజాయిని కోర్టు అనుమతితో డిస్‌పోజ్‌ చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ డా.ఎస్‌. వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు. రేణిగుంట మండలంలోని తూకివాకం వద్ద ఉన్న సాలిడ్‌ వెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌లో జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని శుక్రవారం జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, జిల్లా ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు సమక్షంలో చట్టపరమైన విధానాల ద్వారా కరెంట్‌ యంత్రం ద్వారా కాల్చివేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌, ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గంజాయి పండించడం, రవాణా, వినియోగంపై చాలా కఠినంగా వ్యవహరించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇందులో భాగంగానే ఈగల్‌ సంస్థను ఏర్పాటు చేసి, ఐజీ ర్యాంక్‌ అధికారిని నియమించి ప్రతి జిల్లాలో అనుబంధంగా అధికారులను ఏర్పాటు చేసి గంజాయి, ఇతర డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. తిరుపతి జిల్లాలో గత రెండు నుంచి మూడు సంవత్సరాల్లో సీజ్‌ అయిన గంజాయిని తూకివాకంలో ఇన్సినరేషన్‌ పద్ధతి ద్వారా డిస్పోజ్‌ చేస్తున్నామని, సుమారు 208 కేసుల్లో పట్టుబడిన సుమారు రూ.20 కోట్ల విలువైన 4,100 కేజీల గంజాయిని కోర్టు నుంచి అనుమతి తీసుకుని డిస్పోజ్‌ చేస్తున్నామన్నారు. దీని ద్వారా గంజాయి రవాణా, వినియోగించే వారికి గట్టి హెచ్చరిక పంపినట్లవుతుందన్నారు. తిరుపతి పట్టణం బెంగళూరు, చైన్నెకి ఒక ట్రాన్సిట్‌ పాయింట్‌గా గంజాయి రవాణాలో గుర్తించడం జరిగిందన్నారు. తిరుపతి జిల్లాకు ఎక్కువగా ఏఎస్‌ఆర్‌ జిల్లా నుంచి వైజాగ్‌, కాకినాడ మీదుగా బస్సుల్లో, ఇతర ప్రైవేట్‌ వాహనాల్లో తిరుపతికి వచ్చి, ఇక్కడి నుంచి చైన్నె, బెంగళూరు, కేరళకు వెళ్లడం గమనించామన్నారు. వాటిని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సెర్చ్‌ పార్టీలను పెట్టి రైళ్లు, బస్సులు, లగేజీలను పరిశీలించి చేసి సీజ్‌ చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా తిరుపతి జిల్లాలో సుమారు 15 పీడీ కేసులు పెట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీలు, డిఎస్పీలు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: ‘‘తిరుపతి జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో ఉన్న 35 పోలీస్‌ స్టేషన్లలో 208 కేసుల్లో గడచిన రెండు, మూడేళ్లలో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి నిల్వలు అక్షరాలా 4,098 కిలోలు. విస్తుగొలిపే ఈ అధికారిక గణాంకాల ఆధారంగా చూస్తే తిరుపతి జిల్లాలో యువత భవితను చిత్తు చేస్తున్న మత్తుపదార్థం గంజాయికి ఇది తార్కాణం. ఓ వైపు రాష్ట్ర పాలకులు గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని గుక్కతిప్పుకోకుండా శపథాలు చేస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.’’

విద్యార్థులే లక్ష్యంగా గంజాయి వ్యాపారం

తిరుపతి, రేణిగుంటలకు వచ్చే గంజాయిలో సింహభాగం పక్క రాష్ట్రాలకు తరలించి, జిల్లాకు అవసరమైన సరుకును వేరు చేసి, ఇక్కడ నియమించుకున్న టీములు ద్వారా పట్టణంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు. కళాశాలలతోపాటు హాస్టళ్లు, పీజీల వద్దకు చేరుకుని చిన్నపాటి కవర్లలో నింపిన గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. అలాగే హోటళ్లలో బస చేసే యాత్రికులకు సైతం గంజాయిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పరిధిలోని చిత్తూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాలలోనూ గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

లెక్కకు మించి ఎల్లలు దాటుతున్న గంజాయి

తిరుపతికి చేరే గంజాయిపై పోలీసులు నిఘా పెట్టి పట్టుకుంటేనే కేవలం నాలుగు డివిజన్లలోనే నాలు గు టన్నుల గంజాయి పట్టుబడి కోర్టు అనుమతితో గంజాయిని కాల్చివేశారు. అయితే పోలీసులకు, ఇతర నిఘా వ్యవస్థకు చిక్కకుండా ఎల్లలు దాటుతున్న గంజాయి ఏ మేరకు అక్రమ రవాణా జరుగుతుందో ఊహాతీతం. పుణ్యక్షేత్ర జిల్లాగా పేరుగాంచిన తిరుపతి జిల్లాను దాటాకే దక్షిణాది రాష్ట్రాలకు గంజాయి సరఫరా అయ్యేది.

గంజాయి మత్తులో పెరుగుతున్న అకృత్యాలు, దాడులు

గంజాయి మత్తుకు అలవాటుపడిన ఆకతాయిల అకృత్యాలు జిల్లాలో నిత్యకృతమయ్యాయి. ఇటీవల రేణిగుంటలో ఓ యువకుడు గంజాయి మత్తులో మటన్‌ కత్తితో పట్టపగలు నడిబజార్‌లో తన గొంతు తానే కోసుకుంటూ భయాందోళన రేకెత్తించాడు. రేణిగుంట పట్టణంలో స్థానిక యువకులు కూడా కొందరు గంజాయి మత్తుకు బానిసై జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగం గంజాయి అక్రమ రవాణా చేసే ప్రధాన ముఠాను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే గానీ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చటం కష్టసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నేడు రైతు సమ్మేళనం

తిరుపతి అర్బన్‌: రెండు రాష్ట్రాల రైతులతో శని వారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో రైతు సమ్మేళనం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమ్మేళం కొనసాగించనున్నారు. ఆ దిశగా ఇప్పటికే వారం రోజుల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు సమ్మేళనానికి హాజరుకావాలని ఆహ్వా నం పంపించారు. రైతు నేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ఏపీ ప్రకృతి వ్యవసాయ ప్రథమ ప్రోత్సహకులు కోటపాటి గంగాధరం, గో ఆధారిత వ్యవసాయ నిపుణులు బసంపల్లి టి.నాగరాజు సంయుక్తంగా ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

డ్వామా పీడీగా ఎంసీ మద్దిలేటి

తిరుపతి అర్బన్‌: జిల్లా డ్వామా పీడీగా ఎంసీ మద్దిలేటిని నియమించారు. ఈయన విజయవాడ హెడ్‌ ఆఫీస్‌లో డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(డీడీఓ)పనిచేస్తూ.. తిరుపతికి బదిలీపై రానున్నారు. జిల్లాలో డ్వామా పీడీగా పనిచేస్తున్న శ్రీనివాస ప్రసాద్‌ను పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు బదిలీ చేశారు. 2022 ఆగస్టు నుంచి జిల్లా పీడీగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల డీడీఓల బదిలీల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి జిల్లా కార్యాలయానికి శుక్రవారం ఉత్తర్వులు అందాయని అధికారులు వెల్లడించారు. రెండు రోజుల్లో బదిలీ అయిన స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.

రేపటి నుంచి ఉచిత తైక్వాండో వేసవి శిక్షణ

తిరుపతి ఎడ్యుకేషన్‌ : వేసవి సెలవుల నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ నుంచి మార్షల్‌ ఆర్ట్స్‌ అయిన తైక్వాండో క్రీడలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు టెంపుల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ అకాడమీ అధ్యక్షురాలు పి.గీత ఒక ప్రకటనలో తెలిపారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు అలాగే వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు వేసవి శిక్షణ శిబిరాన్ని శ్రీదేవి కాంప్లెక్స్‌ లోని తైక్వాండో అకాడమీ, అలాగే దేవేంద్ర థి యేటర్‌కు సమీపంలోని శ్రీవారి నిలయంలో ఉచితంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ తైక్వాండో కోచ్‌ మాస్టర్‌ డాక్టర్‌ కె. గోపి నాయుడు ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్న ట్లు తెలిపారు. వివరాలకు 70135 91635, 95731 44231 సంప్రదించాలన్నారు.

తిరుపతి కేంద్రంగా గంజాయి సరఫరా

అల్లూరి సీతారామరాజు జిల్లాలో సాగవుతున్న గంజాయిని రైళ్లు, బస్సులు, లారీలు, వస్తు రవాణా మార్గాల మీదుగా తిరుపతికి నిత్యం అక్రమంగా రవాణా చేస్తున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలోని ప్రధాన పట్టణాల్లోని కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసు యంత్రాంగం ఓ పక్క నిఘా వ్యవస్థను పెంచి, గంజాయి అక్రమ రవాణా ఆనవాళ్లను గుర్తించి కేసులు పెడుతున్నా గంజాయి సరఫరా మాత్రం ఆగడం లేదు. ప్రధానంగా రైళ్లలో గంజాయి రేణిగుంటకు సరఫరా అవుతోంది. ఇక్కడ నుంచి చైన్నె, బెంగళూరు, కేరళ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement