యథేచ్ఛగా వ్యాపారం
మామూళ్ల మత్తులో జోగుతున్న
అధికారగణం
పేదల బియ్యం సరిహద్దులు దాటుతోంది. నెల మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం జోగుతోంది. ఫలితంగా రేషన్ బియ్యం వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. స్మగ్లర్లకు అధికారులు సహకరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలనెలా రూ.కోట్లలో సాగుతున్న ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
జాతీయ రహదారిపై చావలి గ్రామం వద్ద టైర్ పంక్చర్ కావడంతో గ్రామస్తులకు పట్టుబడిన రేషన్‌బియ్యం(పైల్)
పెళ్లకూరు: రేషన్ బియ్యం స్మగ్లర్లుకు వరంగా మారింది. ప్రతి నెలా రూ.4 లక్షలకు పైగా మామూళ్లు పు చ్చుకుని అధికారులు నియోజకవర్గంలో రేషన్ మాఫి యాను ప్రోత్సహిస్తున్నారు. దీంతో రేషన్ బియ్యం వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. పెళ్లకూరు మండలంలోని పునబాక రైస్‌మిల్లు ప్రాంతం రేషన్ బియ్యం సేకరణ కేంద్రంగా(డంపింగ్ పాయింట్) మారింది. ఇదే ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులు మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రేషన్‌షాపుల నుంచి ప్రతి నెలా ఒకటి నుంచి 10వ తేదీలోపు కిలో బియ్యం రూ.10 చొప్పున కొనుగోలు చేసి పునబాక రైస్‌మిల్లు ప్రాంతంలో ఉన్న రహస్య ప్రదేశాల్లో డంప్ చేస్తున్నా రు. అక్కడ నుంచి సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, అక్కంపేట ప్రాంతాలకు చెందిన స్మగ్లర్లకు కిలో రూ.25 చొ ప్పున విక్రయిస్తున్నారు. రేషన్ షాపుల నుంచి కొనుగో లు, పునబాక రైస్‌మిల్లు ప్రాంతంలో రహస్యంగా డంపింగ్ కేంద్రం, వాహనాలను మండల సరిహద్దులు దాటిస్తున్నందుకు వివిధ శాఖల అధికారులకు నెలనెలా భారీగా మామూళ్లు అందుతున్నట్లు తెలుస్తోంది. నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి మీ దుగా బియ్యం యానాం పోర్టుకు తరలించేందుకు ఆ యా మండల కేంద్రాల్లోని పోలీసులు, కొందరు ప్రజా ప్రతినిధులకు రూ.లక్షల్లో నెలనెలా మామూళ్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రేషన్ బియ్యం అక్రమ నిల్వలు, తరలింపుపై స్థానికులు మండల స్థాయి అధికారులకు సమాచారం అందించినప్పటికీ స్పందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. రేషన్‌బి య్యం స్మగ్లింగ్ విషయమై పలుసార్లు స్థానికులు ఫి ర్యాదు చేస్తుండడంపై అధికారులే స్మగ్లర్లకు సమాచా రం చేర వేసి, డంపింగ్ పాయింట్‌లో ఉన్న రేషన్ బి య్యం మరో ప్రాంతానికి తరలించేలా స్మగ్లర్లుకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు అధికారులు తనిఖీల పేరుతో దగ్గరుండి రేషన్ వాహనాలను సరిహద్దులు దాటిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
రేషన్ రైట్ రైట్
విజిలెన్స్ అధికారులు స్పందించాలి
సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలోని వివిధ మండల స్థాయి అధికారులతో రేషన్‌బియ్యం స్మగ్లర్లు నేరుగా కార్యాలయాలకు వెళ్లడం, రహస్య ఫోన్ నంబర్లుతో మంతనాలు చేసుకోవడం గుట్టు చప్పడు కాకుండా రేషన్‌బియ్యం సరిహద్దులు దాటించడం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, రేషన్ బియ్యం స్మగ్లర్లుకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


