తిరుపతి అర్బన్: బడిఈడు పిల్లలను తప్పకుండా పాఠశాలల్లో చేర్పించాలని, జిల్లాలో డ్రాపౌట్లు లే కుండా చూడాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం తిరుపతి ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియంలో జిల్లాలోని 2,500 మందికి పైగా ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 7,500 మంది డ్రాపౌట్లు ఉన్నట్లు తెలుస్తుంద న్నారు. వేసవి సెలవుల్లో వారి తల్లిదండ్రులతో మాట్లాడి వచ్చే విద్యా సంవత్సరానికి బడిలో చేర్పించాలని సూచించారు. మరోవైపు ప్రతి పాఠశాలలో ఆర్వో ప్లాంట్ అందుబాటులో ఉంచాలని చెప్పారు. పాడైన వాటిని బాగు చేయించాలన్నా రు. బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. డీఈఓ కేవీఎన్ కుమార్ మాట్లాడు తూ వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికే విద్యాకానుక కిట్లను విద్యార్థులకు అందించడానికి ఇప్ప టి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఎస్‌ఎస్‌ఏ సీఎంఓ సురేష్‌బాబు పాల్గొన్నారు.
కొత్తగా తిరుపతి– నరసాపురం వీక్లీ ఎక్స్‌ప్రెస్
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి – నరసాపురం మధ్య కొత్తగా వారానికోసారి ఎక్స్‌ప్రెస్ రై లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 17428 నరసాపురం నుంచి తిరుపతికి ప్రతి సోమవారం అందుబాటు లో ఉంటుంది. ఈ రైలు సోమవారం మధ్యాహ్నం 3.50కి నరసాపురంలో బయలుదేరి పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రే ణిగుంట మీదుగా మంగళవారం తెల్లవారు జా మున 3.40కి తిరుపతికి చేరుకుంటుంది. ఈ నెల 27వ తేదీన రైలు ప్రారంభించేందుకు చర్యలు చే పట్టారు. అలాగే తిరుపతి నుంచి వీక్లీ ఎక్స్‌ప్రెస్ నంబర్ 17427 ఆదివారం రాత్రి 10.20కి నరసాపురానికి బయలుదేరుతుంది. రేణిగుంట, నెల్లూ రు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కై కలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు మీదుగా నరసాపురం సోమవారం ఉదయం 9.30కి చేరుకుంటుంది. ఈ రైలు మే నెల 3న ప్రారంభం కానుంది. ఈ రెండు రైళ్లలోనూ సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
స్విమ్స్‌లో కంటి పరీక్షలు
తిరుపతి తుడా:స్విమ్స్ ఆస్పత్రిలో ఆప్తమాలజీ వి భాగం ఆధ్వర్యంలో అత్యాధునిక పరికరాలతో కంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయని విభాగాధి పతి డాక్టర్ రమ్య దీప్తి వెల్లడించారు. గురువారం ఆమె మాట్లాడుతూ సామాన్యులకు సైతం అత్యున్నత ప్రమాణాలతో కూడిన కంటి వైద్యం అందించడమే లక్ష్యంగా స్విమ్స్‌లో వైద్య సేవలు అందజేస్తున్నామని చెప్పారు. కంటి శుక్లం, ఫాకో, మూ న్యువల్ ఎస్‌ఐసీఎస్, కెరాటోమెట్రీ, గ్లాకోమా, విజువల్ ఫీల్డ్స్, గ్లాకోమా, టొనోమెట్రీ, గ్లకోమా లో లేజర్ చికిత్సలు రెటినా, డయాబెటిక్ రెటినోప తి సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ విద్యార్థుల ప్రతిభ
తిరుపతి సిటీ: జిల్లాలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లోని ఆరు బాలికల, నాలుగు బాలుర విద్యాలయాలల్లో విద్యార్థులు బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించారు. 593 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 531 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించినట్లు అధికారులు వెల్లడించారు. 89 శాతం ఉత్తీర్ణత సాధించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో కోట పాఠశాలలో 72 శాతం, నాయుడుపేట 87 శాతం, వాకాడు 68 శాతం, డక్కిలి 100 శాతం, చిల్లకూరు 82 శాతం, సూళ్లూరుపేట 96 శాతం, పుదూరు 99 శాతం, శ్రీకాళహస్తి 96 శాతం, సత్యవేడు 90 శాతం, పుత్తూరు 98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు.
25 నుంచి తిరుమలలో పద్మావతీ పరిణయోత్సవాలు
తిరుమల: తిరుమలలో శ్రీపద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మలయప్పస్వామి వారు తొలి రోజు గజవాహనం, రెండో రోజు అశ్వవాహనం, చివరి రోజు గరుడవాహనంపై ఊరేగుతారు. మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకిలో పరిణయోత్సవ మండపానికి వేంచేస్తారు. ఆ తర్వాత కల్యాణ మహోత్సవం కనులపండువగా నిర్వహిస్తారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 25 నుంచి 27వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దుచేసింది.


