ఉపాధి కూలీల ట్రాక్టర్‌ బోల్తా | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీల ట్రాక్టర్‌ బోల్తా

Apr 17 2026 10:26 AM | Updated on Apr 17 2026 10:26 AM

● ఒకరు మృతి, 53 మందికి గాయాలు ● ఎనిమిది మంది పరిస్థితి విషమం

● ఒకరు మృతి, 53 మందికి గాయాలు ● ఎనిమిది మంది పరిస్థితి విషమం

పెనగలూరు: పెనగలూరు మండలం వెలగచర్ల గ్రామసమీపంలో ఉపాధి పనికి వెళ్తున్న కూలీల ట్రాక్టర్‌ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు. ఎస్‌ఐ రఘురాం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెలగచర్ల గ్రామం నుంచి రేగుంటవారిపల్లి సమీపంలోని పెద్దవంక వద్ద ఉపాధి పనులు చేసేందుకు ట్రాక్టర్‌లో డ్రైవర్‌ కాకుండా 53 మంది ఉపాధి కూలీలు వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా మలుపు వద్ద ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఉపాధి కూలీ కోనేరు వెంకటయ్య (60) అక్కడికక్కడే మృతి చెందాడు. 53 మంది గాయపడ్డారు.వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండడడంతో నలుగురిని తిరుపతి ఆస్పత్రికి, మరో నలుగురిని కడప రిమ్స్‌కు తరలించారు. 36 మందిని డిశ్చార్జ్‌ చేశారు. మరో ఎనిమిదిమంది రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మృతి చెందిన వెంకటయ్య కుటుంబానికి ప్రభుత్వం ద్వారా రూ. రెండు లక్షల పరిహారం అందించనున్నట్లు ఎంపీడీవో విజయారావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement