తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని శ్రీసత్యసాయి సర్కిల్, మడకశిర సబ్–డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.రఘును సస్పెండ్ చేస్తూ ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అవినీతి ఆరోపణలు, విద్యుత్ పరికరాల దుర్వినియోగం, పాడైపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల రవాణాకు డిపార్ట్‌మెంటల్ వ్యాన్‌ను ఉపయోగించకపోవడం, రైతు లతో దురుసుగా ప్రవర్తించడం, ఎస్‌ఏపీలో 262 వ్యవసాయ సర్వీసు దరఖాస్తులను ఉద్దేశపూర్వకంగా తొలగించడం, వివిధ ప్రదే శాల్లో విద్యుత్ లైన్లను అంచనాల అనుమతి లేకుండా మార్చడం, తదితర అంశాలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇస్రో పరిశోధనకు
చిట్వేలి విద్యార్థి ఎంపిక
చిట్వేలి: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న జిల్లావాండ్లపల్లికి చెందిన రామిశెట్టి కుషాల్ జాతీయ స్థాయి ఇస్రో పరిశోధనకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు తెలిపారు. జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి 456 మంది విద్యార్థులు ఎంపిక కాగా ఏపీ నుంచి 13 మంది ఎంపికయ్యారని, వారిలో చిట్వేలి నుంచి ఒక విద్యార్థి ఎంపికయ్యారన్నారు. మే నెలలో 14 రోజులపాటు ఇస్రోకు చెందిన స్పేస్ సెంటర్లకు తీసుకెళ్లి అక్కడ సైన్స్ సంబంధించిన వింతలు, విశేషాలు, సప్తగ్రహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారన్నారు. ఇస్రోకు ఎంపికై న విద్యార్థి కుషాల్‌ను ఉపాధ్యాయ బృందం అభినందించారు.
టీటీడీకి
బ్యాటరీ బగ్గీ విరాళం
తిరుమల: కర్ణాటక రాష్ట్రం కోలార్‌కు చెందిన హైడ్రోకార్ట్ టెక్నో సొల్యూషన్స్ సంస్థ ఎండీ గణేష్ జయవేల్ రూ.10 లక్షల విలువైన బ్యాటరీ బగ్గీ వాహనాన్ని బుధవారం విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ఎదురుగా వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను పేష్కార్ రామకృష్ణకు అందజేశారు.


