ఘనంగా 11వ ఇన్‌స్టిట్యూట్‌ డే | - | Sakshi
Sakshi News home page

ఘనంగా 11వ ఇన్‌స్టిట్యూట్‌ డే

Apr 16 2026 9:54 AM | Updated on Apr 16 2026 9:54 AM

ఏర్పేడు: తిరుపతి ఐఐటీలో బుధవారం 11వ ఇన్‌స్టిట్యూట్‌ డేని ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేఎన్‌.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బొంబాయి ఐఐటీ మాజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సుభాసిస్‌ చౌదురి విచ్చేశారు. ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేఎన్‌ సత్యనారాయణ మాట్లాడుతూ తిరుపతి ఐఐటీ 11ఏళ్ల ప్రస్థానంలో విద్య, పరిశోధన, మౌలిక సదుపాయాలు, విస్తరణ రంగాల్లో ఇన్‌స్టిట్యూట్‌ పురోగతి సాధించిందన్నారు. ముఖ్యఅతిథి ప్రొఫెసర్‌ సుభాసిస్‌ చౌదురి మాట్లాడుతూ తిరుపతి ఐఐటీ 11వ ఇనన్‌స్టిట్యూట్‌డేకు తాను హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. తిరుపతి ఐఐటీలో జరుగుతున్న కార్యకలాపాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్‌ ప్రతిభ చూపిన విద్యార్థులకు విద్యా ప్రతిభ పురస్కారాలు అందజేశారు. అలాగే సిబ్బంది చేసిన విశేష సేవలకు గుర్తింపునిచ్చి వారికి పురస్కారాలను అందజేశారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో ఇన్‌స్టిట్యూట్‌ డే వేడుకలు ముగిశాయి.

Advertisement
 
Advertisement
Advertisement