ఇంటర్‌ ఫలితాల్లో శ్రీచైతన్య హవా | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫలితాల్లో శ్రీచైతన్య హవా

Apr 16 2026 9:54 AM | Updated on Apr 16 2026 9:54 AM

తిరుపతి సిటీ: ఇంటర్మీడియట్‌ బోర్డు బుధవారం విడుదల చేసిన ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో శ్రీచైతన్య హవా కొనసాగించింది. సెకండ్‌ ఇయర్‌ ఎంపీసీలో జ యశ్రీ 992 మార్కులు సాధించగా, శ్రీకర్‌ 991 మార్కులు సాధించి రికా ర్డు సృష్టించారు. అలాగే జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో రిషిత 467, మ నోజ్‌ కుమార్‌ 466, వర్షి ణి 466, కార్తిక్‌ 466 మార్కులు సాధించి విజయదుదింభి మోగించారు. సీనియర్‌, జూనియర్‌ ఎంపీసీ విద్యార్థులు సుమారు 2,694 మంది 465కి పైగా మార్కులు సాధించారు. అలాగే జూనియర్‌ బైపీసీలో శ్రీజ, పావని, జయశ్రీ 451 మార్కులు, సీనియర్‌ బైపీసీలో సాయి సింగ్‌ 989 మార్కులు, ఎస్‌కే నజియా 988 మార్కులు సాధించారని, అలాగే ఫస్ట్‌ ఇయర్‌ బైపీసీలో సుమారు 300 మంది విద్యార్థులు 450 మార్కులపైగా వచ్చాయిని ఏజీఎం బీవీ ప్రసాద్‌ తెలిపారు. డీన్‌లు కేఎల్‌జీ ప్రసాద్‌, రామమోహన్‌రావు, మురళీరావు, భాస్కర్‌లతో పాటు ప్రిన్సిపాళ్లు ప్రతిభ చూపిన విద్యార్థులను, తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు.

ఇంటర్‌ ఫలితాల్లో మెడ్జీ విద్యార్థుల ప్రతిభ

తిరుపతి రూరల్‌: కేసీపేటలోని మెడ్జీ జూనియర్‌ కళాశాల అన్‌ అకాడమీ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో బి.సాత్విమక్‌ రెడ్డి ఎంపీసీ గ్రూపులో 465 మార్కులు సాధించగా బైపీసీలో సి.గీతామాధురి 451 మార్కులు సాధించారు. అలాగే ఎంపీసీలో 460 మార్కులు పైగా సాధించిన వారిలో 20మంది విద్యార్థులు ఉండగా బైపీసీలో 440కిపైగా మార్కులు సాధించిన వారు 15మంది ఉన్నారు. రెండో సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ నుంచి వాళ్ల చైతన్య, జి.రమణసాయి 985మార్కులు సాధించగా బైపీసీలో వి.సి.రూతిక యాదవ్‌ ఎ.క్రిష్ణమోహన్‌రెడ్డి 982 మార్కులు సాధించారు. ఎంపీసీ, బైపీసీలో 975 మార్కులకుపైగా 27మంది విద్యార్థులు సాధించినట్టు కాలేజీ ప్రిన్సిపల్‌ గంగాధర్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement