క్రికెట్ స్టేడియానికి దిగ్గజ క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, కపిల్‌దేవ్ పేరు పెట్టాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సూచించారు. ఈ క్రమంలోనే అపట్లో నిర్మించిన మాస్టర్‌ప్లాన్ రోడ్లకు సైతం రాజకీయాలకు అతీతంగా మహనీయుల పేర్లు పెట్టారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం క్రికెట్ స్టేడియానికి ఎన్‌టీఆర్ పేరు పెట్టింది. దీనిపై తిరుపతి వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నగర ప్రతిష్టకు సంబంధించి విషయాల్లో రాజకీయాలను తీసుకురావడంపై మండిపడుతున్నారు. ఇప్పటికై నా తప్పు సరిదిద్దుకుని క్రీడాకారుల పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.


