రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాధికారులకు చోటు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాధికారులకు చోటు

Apr 14 2026 8:46 AM | Updated on Apr 14 2026 8:46 AM

● రాష్ట్ర అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా చంద్రశేఖర్‌

తిరుపతి మంగళం :

రాష్ట్ర రవాణాశాఖ సాంకేతిక అధికారుల సంఘం ఎన్నికలను ఆదివారం విజయవాడలో నిర్వహించారు. ఆ ఎన్నికల్లో తిరుపతి జిల్లా రవాణాశాఖకు చెందిన నలుగురు అధికారులు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. పుత్తూరుకు చెందిన వాహనాల తనిఖీ అధికారి చంద్రశేఖర్‌ రాష్ట్ర అసో సియేట్‌ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే రాయలసీమ జోనల్‌ ప్రెసిడెంట్‌గా మోటారు వాహనాల తనిఖీ అధికారి వెంకటరమణా నాయక్‌, జోనల్‌ సెక్రటరీగా అతికానాజ్‌, జిల్లా రెప్రజెంటీవ్‌గా స్వర్ణలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిరుపతి జిల్లా రవాణాశాఖలో పనిచేస్తున్న నలుగురు మోటారు వాహనాల తనిఖీల అధికారులు రాష్ట్ర రవాణాశాఖ సాంకేతిక అధికారుల సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అభినందనీయమని జిల్లా రవాణాశాఖాధికారి అన్నారు. వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement