ఎర్రచందనం కేసులో ముగ్గురికి జైలు | - | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం కేసులో ముగ్గురికి జైలు

Apr 14 2026 8:46 AM | Updated on Apr 14 2026 8:46 AM

తిరుపతి లీగల్‌: ఎరచ్రందనం దుంగల అక్రమ రవాణా కేసులో ముగ్గురికి రెండేళ్లు వంతున జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్‌ జడ్జి శ్రీకాంత్‌ సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. 2011 ఏప్రిల్‌ 22వ తేదీ బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు బుచ్చిరెడ్డిపాలెం, జొన్నవాడ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. పోలీసుల తనిఖీల్లో ఓ టిప్పర్‌లో 78 ఎరచ్రందనం దుంగలు తరలిస్తుండగా గుర్తించారు. పిచ్చాటూరు మండలం, కీలపూడికి చెందిన బి వెంకటాచలం, అదే మండలం రామగిరికి చెందిన గోపాల్‌ రెడ్డి శంకర్‌, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాళెం మండలం, ఖాజానగర్‌కు చెందిన షేక్‌ షాకీర్‌ వాహనంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. ముగ్గురిని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు రేంజ్‌, సంగం సెక్షన్‌ ఫారెస్ట్‌ అధికారులకు అప్పగించారు. ఫారెస్ట్‌ సిబ్బంది ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ముగ్గురిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ముగ్గురికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement