బ్రాహ్మణులపై దాడులు హేయం | - | Sakshi
Sakshi News home page

బ్రాహ్మణులపై దాడులు హేయం

Apr 13 2026 7:14 AM | Updated on Apr 13 2026 7:14 AM

– బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌

తిరుపతి కల్చరల్‌: రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ ఉనికిని చాటుకునేందుకు కొందరు బ్రాహ్మణులపై దాడులు చేయడం హేయమైన చర్య అని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్‌ మండిపడ్డారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ రాజకీయ పబ్బం కోసం మందకృష్ణ మాదిగ బ్రాహ్మణ సమాజాన్ని టార్గెట్‌ చేసి విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. అన్ని రంగాల్లో కలిసిపోతున్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం ప్రచారం కోసమేనని, భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డు పెట్టుకుని ఒక సామాజిక వర్గంపై విద్వేషం చిమ్ముతున్న వ్యక్తులపై హీట్‌ స్పీచ్‌ చట్టాల కింద తక్షణమే చర్యలు తీసుకోవాలని, బ్రాహ్మణులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో అర్చకులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధికార ప్రతినిధి కొత్తపల్లి విజయ్‌కుమార్‌, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రెడ్డి ప్రకాష్‌, ముకుందపు మహేష్‌, జిల్లా అధికార ప్రతినిధి బాలాజీ శర్మ, బాలాజీరావు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement