న్యూస్‌రీల్
చెప్పింది చేయలేదని అధికారులపై జులుం
ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి పక్కనబెట్టిస్తున్న వైనం
రేణిగుంట, ఏర్పేడు తహసీల్దార్లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధింపులు
మూడు రోజులైనా ఆ స్థానాలు ఖాళీ
తాజాగా తొట్టంబేడు మండలంలో ముగ్గురు రెవెన్యూ అధికారుల బదిలీ
హడలిపోతున్న అన్ని శాఖల అధికారులు
జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ఐదో స్నాతకోత్సవం గురువారం తిరుపతి ఎన్‌ఎస్‌యూలో ఘనంగా జరిగింది.
శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ప్రభుత్వ అధి కారులు హడలిపోతున్నారు. కూటమి నే తల బెదిరింపులు, వేధింపులతో మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇప్పటిదాకా అవినీతి మరక అంటని వారు తెలిసితెలి సి తప్పులు చేయలేక.. అధికార పార్టీ నేత ల బూతు పురాణం వినలేక.. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి తట్టుకోలేక కుమిలిపోతున్నారు. తీరా కష్టపడి సంపాదించిన పేరు ప్రతిష్టలు పోగా.. ఉద్యో గమూ లేకుండా పక్కన బెట్టేయడం చూసి ఆవేదనకు లోనవుతున్నారు. ఇంతబతుకు బతికీ.. తీరా ఇలా చేస్తారని అనుకోలేదని తమ సన్నిహితుల వద్ద చెప్పుకుని కన్నీళ్లు పెడుతున్నారు. ఇంతకీ ఏమిటా కథా.. ఎందుకంత ఆవేదన.. మీరే చదవండి!
కాదు..కూడదంటే..
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘నిబంధనలతో మీకు పనిలేదు. మేం చెప్పింది చెయ్యి.. అంతా మేం చూసుకుంటాం..’ అంటూ కూటమి నేతలు అధికారులను ఉసిగొల్పుతున్నారు. తమకు కావాల్సిన పనులన్నీ చక్కబెట్టుకుంటున్నారు. మాట వినని వారిపై ని ఘా పెడుతున్నారు. పైఅధికారులపై ఒత్తిడి తెచ్చి వారి విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. కాదు.. కూడదంటే ఉద్యోగమే లేకుండా చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో తమ పలుకబడి ఉపయోగించి సంబంధిత అధికారుల నుంచి ఒత్తిడి చేయిస్తున్నారు. ఆపై ఉద్యోగమే లేకుండా.. ఎక్కడా పోస్టింగే ఇవ్వకుండా పక్కన బెట్టేస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. తాము చెప్పిన పనులు చేయడం లేదని తిరుపతి జిల్లాలోని రేణిగుంట, ఏర్పేడు తహసీల్దార్లను పక్కనబెట్టేశారు. మూడు రోజులవుతున్నా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. ఆ స్థానంలో వేరొకరికి బాధ్యతలు అప్పగించకుండా చోద్యం చూస్తున్నారు. అదే నియోజకవర్గంలో మండల నాయకుడి మాట వినడం లేదని తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ముగ్గురు రెవెన్యూ అధికారులను కేవీబీ పురం మండలానికి బదిలీ చేశారు. అలాగే చిత్తూరు జిల్లా పలమనేరులోనూ ఇలాంటిదే చోటు చేసుకుంది.
మూడు రోజులైనా..?
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో మూడు రోజులుగా రేణిగుంట, ఏర్పేడు తహసీల్దార్లు కార్యాలయానికి రావడం లేదు. వారిని బదిలీ చేశారా? లేదా? కూడా తెలియడం లేదు. పోనీ ఆ స్థానంలోకి వేరొక అధికారి వచ్చారా? అంటే అదీ లేదు. జిల్లాలోనే అత్యంత ప్రాధాన్యమైన మండలాల్లో రేణిగుంట, ఏర్పేడు ప్రధానమైనవి. రెవెన్యూతో పాటు.. ప్రొటోకాల్ వ్యవహరాలు అధికంగా ఉంటాయి. అటువంటి మండలాల్లో మూడు రోజులుగా తహసీల్దార్లు లేరు. ఉన్న ఇద్దరు అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధి చెప్పిన పని చేయలేదని ఆగ్రహానికి లోనైనట్టు సమాచారం. ఆ ఇద్దరు తహసీల్దార్లను బదిలీ చేయమని ఉన్నతాధికారులకు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. ఆ ప్రజాప్రతినిధి చెప్పినట్టు వినకపోతే ఎక్కడ అమరావతి నుంచి ‘ముఖ్య’ నేతల నుంచి తిట్టిస్తారోనని భయపడి ఉన్నతాధికారి ఆ ఇద్దరు తహసీల్దార్లకు సమచారం ఇచ్చారు.
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కూటమి నేతల కర్ర పెత్తనం
ఇన్‌చార్జ్ కనుసన్నల్లోనే అధికారులు
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు నడుచుకోకపోతే ఏ అధికారి ఉద్యోగం చేయలేని దుస్థితి. పలమనేరు నియోజకవర్గంలో ప్రతి మండలాని కి ఒకరు టీడీపీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ ఇన్‌చార్జ్‌కి తెలియకుండా ఏ ఒక్క ఫైలు కదలడానికి వీల్లేదు. రెవెన్యూ అప్పీళ్లపైనా ఆ ఇన్‌చార్జ్ చెప్పినట్లు అధికారులు నడుచుకోవాలి. లేదంటే, ఆ అధికారి అక్కడ పనిచేయలేరు. నెల క్రితం తవణంపల్లె తహసీల్దార్‌ను నిర్ధాక్షి ణ్యంగా బదిలీ చేయడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.
తొట్టంబేడులో ముగ్గురు బదిలీ
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండల పరిధిలో ముగ్గురు రెవెన్యూ అధికారులను శుక్రవారం బదిలీ చేశారు. స్థానిక టీడీపీ నాయకుడు చెప్పిన పనులు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ చోటామోటా నాయకుడు జిల్లా లోని ఆ ప్రజాప్రతినిధి ఫిర్యాదు చేశారు. వెంటనే రెవెన్యూ డివిజనల్ అధికారికి ఫోన్ చేసి ఆ ముగ్గురిని బదిలీ చేయమని హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. చేసేది లేక ఆ ముగ్గురిని కేవీబీ పురం మండలానికి బదిలీ చేశారు. ఇదిలా ఉంటే గతంలో అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటు సస్పెండ్‌కి గురైన ఓ రెవెన్యూ అధికారి టీడీపీ నాయకులకు ముడుపులు సమర్పించుకుని పోస్టింగ్ తెచ్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


