యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

Apr 11 2026 9:58 AM | Updated on Apr 11 2026 9:58 AM

– 8లో

– 8లో

ఏర్పేడు మండలం చెన్నంపల్లి సమీపంలోని నక్కల వాగు నుంచి అక్రమార్కులు ఇసుక యథేచ్ఛగా తరలిస్తున్నారు.

రియల్‌ ఎస్టేట్‌ వెంచరే కారణమా?

మొన్నటి వరకు తిరుపతి జిల్లాలోని ఆ ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులు చెప్పిన పనులన్నీ చేస్తూ వచ్చిన ఆ ఇద్దరు తహసీల్దార్లు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో ఆక్రమణలు చోటుచేసుకున్న విషయాన్ని ప్రశ్నించడమే వారి పాలిట శాపంగా మారింది. ఆ ప్రజాప్రతినిధికి ముఖ్య అనుచరుడిగా వ్యవహరిస్తున్న చోటామోటా నాయకుడు 25 ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేశారు. అందులో ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఆ విషయాన్ని ఆ చోటా నాయకుడికి తెలియజేయడంతో పాటు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమచారం. దీన్ని జీర్ణించుకోలేని ఆ చోటామోటా నేత సదరు ప్రజాప్రతినిధి చెవిన వేశారు. వెంటనే వారికి ఫోన్‌ చేసి ఆగ్రహం వ్యక్తం చేయడం, ఉన్నతాధికారి వద్దకు వచ్చి కూర్చొని ఆ ఇద్దరినీ బదిలీ చేయమని ఒత్తిడి చేయడం జరిగినట్లు తెలిసింది. చేసేది లేక ఉన్నతాధికారి వారికి విషయం తెలియజేశారు. అయితే రాత పూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిసింది. దీంతో రేణిగుంట, ఏర్పేడు తహసీల్దార్‌ కార్యా లయాలు మూడు రోజులుగా వెలవెల బోతున్నాయి. వివిధ రెవెన్యూ సమస్యలపై వచ్చేవారు, సర్టిఫికెట్ల కోసం వచ్చే వారు తహసీల్దార్లు లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి.

Advertisement
 
Advertisement
Advertisement