ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థుల అరుదైన ఘనత | - | Sakshi
Sakshi News home page

ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థుల అరుదైన ఘనత

Apr 11 2026 9:58 AM | Updated on Apr 11 2026 9:58 AM

తిరుపతి సిటీ: నగరంలోని ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో బీఎస్సీ సైకాలజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థు లు కిరణ్మయి, సాయితేజ, చేతన తమ నూతన పరిశోధనలతో అబ్బురపరచి అరుదైన ఘనత సాధించారు. సైకాలజీ విభాగాధిపతి ఉమారాణి, అధ్యాపకురాలు డాక్టర్‌ సుధారాణి మార్గదర్శకంలో విద్యార్థులు డిజిటల్‌ డెటాక్స్‌ అండ్‌ సైకలాజికల్‌ వెల్‌ బీయింగ్‌ ఆమాంగ్‌ కాలేజ్‌ స్టూడెంట్స్‌, ఏ సిస్టమేటిక్‌ రివ్యూ ఆఫ్‌ ఎవిడెన్స్‌ అండ్‌ ఇంప్లికేషన్‌ అనే అంశంపై పరిశోధనలు చేశారు. వీరు అధ్యయనం చేసి పరిశోధించిన అంశాలను ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ అడ్వాన్డ్‌ అండ్‌ ఫ్యూచర్‌ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. విద్యార్థులపై డిజిటల్‌ ప్రభావం, మానసిక ఒత్తిడి, భావోద్వేగాలు, ఆందోళన, నిద్ర లోపాలు వంటి పలు అంశాలపై విద్యార్థులు సుదీర్ఘంగా పరిశోధనలు చేశారు. విద్యార్థుల సాధించిన ఘనతను ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, అధ్యాపకులు శుక్రవారం కళాశాలలో ఘనంగా అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement