శ్రీవారి దర్శనానికి 6 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 6 గంటలు

Apr 11 2026 9:58 AM | Updated on Apr 11 2026 9:58 AM

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 64,136 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,255 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.79 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.

రుయాలో

ఓపీ సమయాల్లో మార్పు

తిరుపతి తుడా: రుయాస్పత్రి ఓపీ సమయాల్లో మార్పులు తీసుకొచ్చారు. ఎండలు మండుతుండడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఇబ్బంది కలగకుండా రుయా అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఓపీలు ఇచ్చేవారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ ఓపీలు కొనసాగేవి. ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాల్చడంతో ఉదయం 8:30 నుంచి ఓపీ సేవలు ప్రారంభం కానున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement