చంద్రగిరి: శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాలకు అరుదైన గుర్తింపు లభించింది. శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల జాతీయ సేవా పథకం ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు గత 20 ఏళ్లుగా ఇండియన్ అసోసియేషన్ ఫర్ బ్‌లైండ్ (ఐఏబీ) అనే స్వచ్ఛంద సంస్థకు విరాళాలు అందిస్తూ వస్తున్నారు. కంటి చూపు లేని ఎందరికో చేయూతను అందించడంలో సహకరిస్తున్న వ్యవసాయ కళాశాల ఉద్యోగులు, విద్యార్థుల సేవా గుణాన్ని గుర్తించి ఐఏబీ బ్‌లైండ్ ఎంపవర్మెంట్ చాంపియన్స్ –2025 గోల్డ్ జోన్ అవార్డును సంస్థ నిర్వాహకులు గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా అవార్డును కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ రెడ్డి శేఖర్‌కు అందజేశారు. ఈ గుర్తింపు దక్కడానికి సహకరించిన వ్యవసాయ కళాశాల జాతీయ సేవా పథకం అధికారులు, శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.రెడ్డిశేఖర్ అభినందించారు. రైతు సంక్షేమానికి సంబంధించిన విద్యను అభ్యసిస్తున్న కళాశాల విద్యార్థులు, జాతీయ సేవా పథకం వలంటీర్లు, జాతీయ సేవా పథకం ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 2024లోనూ శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాలకు ఐఏబీ బ్‌లైండ్ ఎంపవర్మెంట్ చాంపియన్స్ గోల్డ్ జోన్ అవార్డును దక్కిందని వ్యవసాయ కళాశాల అసోసియేటెడ్ డాక్టర్ ఎం రెడ్డి శేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం అధికారులు మధుసూదన్ రెడ్డి, జ్యోత్స్న, ప్రదీప్ కుమార్, రాజేష్, సబిత తదితరులు పాల్గొన్నారు.


