తిరుపతి అర్బన్: సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం పది నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు శిక్షణ ఇస్తారు. హెయిర్ కటింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్‌ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్‌మెంట్, మేకప్ (బ్రై డల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్, గ్రూమింగ్ ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 13వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల దాకా రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్లతోపాటు రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 14 నుంచి మే నెల 12 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్క్‌షాపు ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం అదనంగా బ్యూటీ స్టూడియో, ఇన్‌స్టిట్యూషన్, బైరాగిపట్టెడ ఆర్చ్ రోడ్డు, కెనరా బ్యాంక్ పైన, తిరుపతి. శిక్షణ కూడా ఇక్కడే ఉంటుంది. ఇతర వివరాలకు 95534 54335, 96666 97219, నంబర్లను సంప్రదించగలరు.
కరుణించి కాపాడు తల్లీ!
శ్రీకాళహస్తి: కరుణించి కాపాడు తల్లీ అని భక్తులు జాతర సందర్భంగా ముత్యాలమ్మను భక్తిశ్రద్ధలతో కొలిచారు. ముక్కంటి ఆలయానికి అనుబంధంగా ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో జాతర సందర్భంగా గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఎదుట ఉదయం పోతురాజు ముగ్గు, రేణుకాంబ ముగ్గులు వేశారు. పలువురు మహిళలు అమ్మవారికి సారెను సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి అమ్మవారికి విశేషాలంకరణ చేసి ఊరేగించారు. ఆలయ ఈఓ వెంకటేశ్వర్లు అమ్మ వారికి సారె సమర్పించి గ్రామోత్సవంలో పాల్గొన్నారు.


