ఆందోళన తప్పదు | - | Sakshi
Sakshi News home page

ఆందోళన తప్పదు

Apr 9 2026 7:17 AM | Updated on Apr 9 2026 7:17 AM

అర్ధరాత్రి సమయంలో ఇళ్లలోకి చొరబడి అక్రమంగా పట్టుకెళ్లిన మా వాళ్ల అచూకీ తెలపకుంటే ఆందోళన తప్పదు. అమాయకులైన గిరిజనులపై పోలీసుల తీరు అత్యంత అమానుషం. ఏ తప్పు చేయని గిరిజనులను అక్రమంగా కేసుల్లో ఇరికిచేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఐదు రోజులు గడిచినా, తప్పు చేసి ఉంటే ఎందుకు అరెస్టు చూపలేదు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. – పరమేశం, గిరిజన నాయకుడు

చేయని నేరం ఒప్పుకోవాలంట

అర్ధరాత్రి సమయంలో పోలీసులు మఫ్టీలో వచ్చి నా భర్తలను బలవంతంగా ఎత్తుకెళ్లారు. అడ్డొచ్చిన నన్ను కొట్టి, నా మూడేళ్ల కుమార్తెను విసిరి పారేశారు. నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా చేయని నేరం ఒప్పుకోవాలంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని నా భర్త ఏడుస్తున్నాడు. – అఖిల, కల్యాణ్‌ భార్య, చవటకాల్వ

పరుష పదజాలంతో దూషించారు

నేను, నా భర్త ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో శనివారం అర్ధరాత్రి పోలీసులు మా ఇంట్లోకి చొరబడ్డారు. ఒక్కసారిగా నా భర్తపై దాడికి చేశారు. ఎవరు సార్‌ మీరు, ఎందుకు కొడుతున్నారని ప్రశ్నిస్తే, పరుష పదజాలంతో దూషించారు. తిరుచానూరు పోలీసు స్టేషన్‌లో నా భర్త ప్రాణభయంతో వణికిపోతున్నారు. నాకు భయమేస్తోంది. – నాగమ్మ, బాలాజీ భార్య, చవటకాల్వ

గిరిజనులంటే అంత చులకనా..?

గిరిజనులంటే పోలీసులకు అంత చులకనా. మా గ్రామంలోకి అర్ధరాత్రి పోలీసులు రౌడీల్లా రావడం దారుణం. ప్రశ్నించిన నన్ను కూడా కేసు పెట్టి లోపలేస్తామంటూ బెదిరించారు. పోలీసులు దాడి చేయడం ఏమిటి.. తప్పు చేసి ఉంటే చట్టపరంగా కోర్టులో ప్రవేశపెట్టాలి. అలాంటిది ఏమి చేయకుండా, ఎందుకు వారిని పోలీసు స్టేషన్‌లో పెట్టినట్టు. – కవిత, ప్రత్యక్షసాక్షి, చవటకాల్వ

Advertisement
 
Advertisement
Advertisement