రేణిగుంట: మండలంలోని మామండూరు సమీపంలోని రేణిగుంట కడప ప్రధాన రహదారిపై బుధవారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో లారీ డ్రైవర్ చోటు యాదవ్ లలాలారీలో ఇరుక్కుని మూడు గంటల పాటు నరకయాతన అనుభవించాడు. పోలీసులు క్రైన్ సహాయంతో అతి కష్టం మీద లారీని తొలగించి డ్రైవర్‌ను హాస్పిటల్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు.. అహ్మదాబాద్ నుంచి చైన్నె పోర్ట్‌కు మెడికల్ పరికరాలు తీసుకుని వెళ్లే లారీని శ్రీ సిటీ నుంచి కడపకు వెళుతున్న లారీ డ్రైవర్ చోటు యాదవ్ అతివేగంగా వచ్చి ఢీకొన్నాడు. ఈ ఘటనలో అహ్మదాబాద్ నుంచి వచ్చే లారీలోని డ్రైవర్ విజయ్ బాలు కోకెర, క్లీనర్ శుభం కాకా సాహెబ్ ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. శ్రీ సిటీ నుంచి వచ్చే లారీలో ఉన్న చోటు యాదవ్ కాలు లారీ క్యాబిన్‌లో ఇరుక్కొని పోవడంతో సుమారు మూడు గంటల సమయం నరకయాతన అనుభవించాడు. విషయం తెలుసుకున్న రేణిగుంట అర్బన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో లారీ క్యాబిన్‌ను తొలగించి చోటు యాదవ్‌ను బయటికి తీసి ముగ్గురిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతివేగంగా లారీ నడిపి ప్రమాదానికి కారణ కారణమైన చోటు యాదవ్‌పై కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రేణిగుంట పోలీసులు తెలిపారు.


