శ్రీకాళహస్తి: పట్టణంలోని ముత్యాలమ్మగుడి వీధిలో ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో బుధవారం అమ్మవారి జాతర ఘనంగా జరిగింది. రెండోరోజు బుధవారం కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా జరిపారు. అమ్మవారి ఎదుట పోతురాజు ముగ్గు వేసి, శాంతి పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం గంగపెట్టెను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులకు అన్నదానం చేశారు. రాత్రి 7 గంటలకు రేణుకాదేవి ముగ్గు, కుంభం వేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయ పాలకమండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ సారెను సమర్పించారు. ఆలయ పండితులు సారెను స్వీకరించి ఆయన్ని ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు.


