మహాశక్తికి | - | Sakshi
Sakshi News home page

మహాశక్తికి

Jul 24 2025 7:02 AM | Updated on Jul 24 2025 7:50 AM

సంస్కృత వర్సిటీలో అనిర్బన్‌
జాతీయ సంస్కృత వర్సిటీని కేంద్ర హోం మంత్రిత్వశాఖ బెంగళూరు ప్రాంతీయ కార్యాలయ అధికార భాష డీడీ సందర్శించారు.
దారి కల్పించే వారేరీ?
రోడ్డుకు కంచె వేయడంతో ఓ ఇంటికి దారి లేకుండా పోయింది. మాకు దారి కల్పించేవారేరీ అని బాధితులు అంటున్నారు.
రేపటి నుంచి టీటీడీ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు
సర్వదర్శనానికి 12 గంటలు

గురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025

8లో

నేను మారిన మనిషిని.. మహిళలను మహారాణులను చేస్తాను.. మహాశక్తి ఆడబిడ్డ నిధి పథకంతో అతివలను అందలమెక్కిస్తాను.. అధికారంలోకి వస్తే అందరినీ ఆదుకుంటాను.. నా మాట నమ్మండి.. ఇదీ నాటి చంద్రబాబు మాట. మహాశక్తి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రను అమ్మేయాల్సిందే.. ఇదీ నేటి వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట.. అంటే కూటమి సర్కారు ఆ పథకానికి మంగళం పాడేసినట్టేనన్న సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. అయితే అతివలు మాత్రం దీనిపై ఆగ్రహం వక్తం చేస్తున్నారు. ఆడబిడ్డల ఉసురు తగిలిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని మండిపడుతున్నారు.

హామీలు గుప్పించినప్పుడు

తెలియలేదా మంత్రివర్యా!

అధికార దాహంతో అలి వికాని హామీలను గుప్పించి మహిళలను మభ్యపెట్టి అధికారం చేపట్టారు. నా ఆడబిడ్డలకు అండగా ఉంటానంటూ ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసి తీరుతా అంటూ చంద్రబాబు ఎన్నికల సభల్లో ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు మా వల్లకాదు అంటున్నారు. సాక్షాత్తు మంత్రి అచ్చెన్నాయుడు ఆంధ్రాను అమ్మితేగాని ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయలేమంటూ తేల్చిచెప్పడం విడ్డూరంగా ఉంది. హామీలు గుప్పించిన నాడు ఈ విషయం మంత్రి వర్యులకు తెలియదా.. కచ్చితం పథకం అమలు చేసి తీరాలి. లేదంటే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు. –డాక్టర్‌ సాయిలక్ష్మి,

ఐద్వా, జిల్లా కార్యదర్శి, తిరుపతి

మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు

కూటమి సర్కార్‌ ఎన్నికల హామీలను అమలు చేయకుంటే మహిళల ఆగ్రహానికి గురికాకతప్పదు. అధికారం కోసం మహిళలను మభ్యపెట్టి ఆడబిడ్డ నిధి పథకాన్ని షరతులు లేకుండా అమలు చేస్తామని చెప్పారు. నేడు అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నట్లు సైటెర్లు వేయడం కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనకు నిదర్శనం. జిల్లాలో లక్షల మంది మహిళలు ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం ఎదురు చూస్తున్నారు. తక్షణం పథకాన్ని అమలు చేసి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లేనిపక్షంలో మహిళలోకం తిరగబడే పరిస్థితి ఉంది. –ఆర్‌ ఆషా, పీడీఎస్‌ఓ, జిల్లా కార్యదర్శి, తిరుపతి

మహిళలను మోసం చేయడం దారుణం

ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయలేమని సాక్షాత్తు మంత్రి ప్రకటించడం ఆశ్చర్యమేసింది. ఎన్నికల సమయంలో అమలు చేయలేమని తెలిసీ హామీ ఇచ్చారంటే మహిళలను వంచించి మోసం చేసి ఓట్లు దండుకుని అధికారం చేపట్టాలనే ఏకై క లక్ష్యంతో హామీలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. జిల్లాలోని ప్రతి ఇంట్లో మహిళ ఈ పథకం అమలు చేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ కూటమి ప్రభుత్వం ఆశలపై నీళ్లు చల్లేసినట్లు తెలుస్తోంది. ప్రజా వ్యతిరేఖ కార్యక్రమాలు చేపడితే ఏ ప్రభుత్వమైన మనుగడ సాగించడం కష్టమే. –శ్రవంతి,

విద్యార్థి సంఘం నాయకురాలు, తిరుపతి

తిరుపతి–కువైట్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించాలి

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సీఈఓతో ఎంపీ గురుమూర్తి భేటీ

తిరుపతి మంగళం : తిరుపతి విమానాశ్రయం నుంచి కువైట్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసు లు ప్రారంభించాలని తిరుపతి ఎంపీ డాక్టర్‌ మ ద్దిల గురుమూర్తి కోరారు. బుధవారం ఢిల్లీలో ఎ యిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సీఈఓ అలోక్‌ సింగ్‌తో ఆయన భేటీ అయ్యారు. తిరుపతి విమానా శ్రయం ప్రాధాన్యతను, అలాగే రాయలసీమకు చెందిన వలస కార్మికులు గల్ఫ్‌ దేశాల్లో ఎక్కువ గా ఉన్నారని, వారికి మేలు జరుగుతుందని ఆయనకు ఎంపీ వివరించారు. తిరుపతి నుంచి నేరుగా కువైట్‌కి వెళ్లే విమానం నడిపితే గల్ఫ్‌ వలసదారులకు ఎంతో ఉపశమనం లభిస్తుందని, దీంతో ప్రయాణ సమయం, ఖర్చు తగ్గుతాయని ఆయనకి విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం సమర్పించారు. ఈ విజ్ఞప్తికి అలోక్‌ సింగ్‌ సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.

ఎట్టకేలకు ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు

తిరుపతి సిటీ:ఎట్టకేలకు ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు జరిగింది. తొలి విడత జాబితా మంగళవారం విడుదల చేస్తామంటూ ప్రకటించిన అధికారులు సాంకేతిక కారణాలతో జాబితా విడుదల లో జాప్యమైనట్లు ప్రకటించారు. దీంతో మంగళవారం అంతా ఫోన్‌లకే పరిమితమైన తల్లిదండ్రు లు, విద్యార్థులకు నిరాశే మిగిలింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు తొలివిడత సీట్ల కేటా యింపు జాబితా విడుదలైంది. దీంతో తల్లిదండ్రు లు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. తాము ఎంపిక చేసుకున్న కళాశాలలో సీట్లు సాధించిన విద్యార్థులు ఈనెల 27వ తేదీలోపు సంబంధిత కళాశాలలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంది.

విధులకు హాజరు కాకుంటే తొలగిస్తాం

తిరుపతి సిటీ: రేణిగుంట మండలం గుండ్రాలకాలువ పాఠశాలలో ఎస్‌జీటీగా విధుల నిర్వహిస్తున్న పి.దేవరాజులు 2022 జూన్‌ 27వ తేదీ నుంచి విధులకు హాజరుకావడం లేదని డీఈఓ కేవీఎన్‌ కుమార్‌ తెలిపారు. జిల్లా విద్యాశాఖ నుంచి పలుసార్లు రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా ఎంఈ ఓ లేఖలు పంపినప్పటికీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారన్నారు. సదరు టీచర్‌ మరో మూడు రోజుల్లోపు ఎంఈఓ కార్యాలయంలో హాజరై సంజాయిషీ ఇవ్వాలని, లేనిపక్షంలో వి ధుల నుంచి శాశ్వతంగా తొలిగిస్తామన్నారు.

జిల్లాలో రూ.2,500 కోట్ల

బకాయిలు

జిల్లాలో 2024 గణాంకాల ప్రకారం 18 ఏళ్ల పైబడిన మహిళలు మొత్తం 10,23,177 మంది ఉన్నారు. బాబు సర్కార్‌ ఆడబిడ్డ నిధికి సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం గత ఏడాది కాలానికి రూ.2513.02 కోట్లు బకాయి పడింది. అంటే సరాసరి ఒక్కో మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు చెల్సించాల్సి ఉంటుంది. అయితే ఏడాదిగా పథకాల అమలులో గోల్‌మాల్‌ చేస్తూ నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాల అమలుపై నోరుమెదపలేదు. ఇటీవల మంత్రి చాలా స్పష్టంగా ఆడబిడ్డనిధి పథకం అమలు చేసే పరిస్థితి లేదని బాహాటంగా చెప్పడంతో కూట మి సర్కార్‌ నైజం బయటపడిందని, రానున్న రోజుల్లో ప్రజా వ్యతిరేఖతను బాబు సర్కార్‌ ఎదుర్కొనక తప్పదని హెచ్చరిస్తున్నారు.

తిరుపతి సిటీ: గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు మారిన మనిషినంటూ జనాన్ని నమ్మించాడు. అమలుకు సాధ్యం కానీ హామీలు గుప్పించి.. అధికారం చేజిక్కించుకున్నాడు. అనంతరం హామీలను గాలికొదిలేసి నమ్మి ఓటు వేసిన మహిళలకు శఠగోపం పెట్టేశాడు. ఆడబిడ్డ నిధి పథకంతో ప్రతి కుటుంబంలోని 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1500 బ్యాంకు ఖాతాలో జమ చేస్తానని ప్రగల్భాలు పలికాడు. అయితే నేడు ఆడబిడ్డ నిధికి మంగళం పాడేస్తున్నట్లు మంత్రి ద్వారా సంకేతాలు పంపుతున్నారు.

ఆడబిడ్డ నిధి పథకమా..

ఆంధ్రాను అమ్మాల్సిందే!

సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఆడపడుచులకు సంబంధించి మహాశక్తిలో భాగంగా బాబు ప్రకటించిన ఆడబిడ్డ నిధి పథకం అమలుపై ఏడాది గడుస్తున్నా నోరు మెదపలేదు. దీంతో ఎప్పుడో ఒకప్పుడు ఇస్తారులే అన్న ఆశతో ఎదురు చూస్తున్న మహిళలకు ఒక్కసారిగా బాబు సర్కార్‌ ఝలక్‌ ఇచ్చింది. స్వయానా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఓ సభలో ఆడబిడ్డ నిధి అమలుపై ప్రజలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మహాశక్తి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రరాష్టాన్ని అమ్మే యాల్సిన పరిస్థితి వస్తుందని బహిరంగంగా ప్రకటించేశారు. దీంతో ఆడబిడ్డ నిధికి మంగళం పాడేశారని, తమను నమ్మించి మోసం చేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి వ్యాఖ్యలు మహిళలను బాధించాయి

సార్వత్రిక ఎన్నికల్లో అధికార వాంఛతో కూటమి నేతలు మహిళలను మభ్యపెట్టి పథకాలను ప్రకటించి అమలు చేసి తీరుతామంటూ ప్రగల్భాలు పలికారు. అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా పథకాల ప్రస్తావనే రావడంలేదు. ఆడబిడ్డ నిధిని నిర్వీర్యం చేశారు. లక్షల మంది మహిళలు ఆడబిడ్డ నిధి కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న తరుణంలో మంత్రి బహిరంగ సభలు పథకం అమలు చేయాలంటే ఆంధ్రను అమ్మేయాలంటూ వెటకారంగా మాట్లాడటం మహిళలను ఎంతో బాధించింది. పథకం అమలు చేయకపోతే ఆంధ్రలో పరిస్థితి దారుణంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం కథ కంచికే. – శోభారాణి, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయిని, తిరుపతి

ఆడబిడ్డ నిధిపై సైటెర్లు దారుణం

ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చకుండా మహిళలను వంచించడం దారుణం. ఆడబిడ్డ నిధి కింద కుటుంబంలోని ప్రతి మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని కూటమి నేతలు ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున మహిళలు ఆ పార్టీలకు ఓట్లు వేసి గెలిపించారు. మహిళలు ఎంతో నమ్మకంగా ఇచ్చిన అధికారాన్ని అంతే నమ్మకంతో ఇచ్చిన మాటకు కట్టుబడి పథకాలను అమలు చేయాలి. మంత్రి ఆడబిడ్డ నిధిపై సైటెర్లు వేస్తూ ఆంధ్రాని అమ్మాలంటూ మాట్లాడటం దారుణం.

– సావిత్రి, గృహిణి, తిరుపతి

తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండాయి. క్యూ నారాయణగిరి వరకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 79,467 మంది స్వామివారిని దర్శించుకోగా 28,642 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.42 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.

31 వరకు ప్రభుత్వ జూనియర్‌

కళాశాలలో ప్రవేశాలు

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

ఆడబిడ్డకు అధోగతేనా? అని అతివల మండిపాటు

ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే

ఆంధ్రను అమ్మాల్సిందేనంటూ సైటెర్లు

మంత్రి వ్యాఖ్యలపై మండిపడుతున్న మహిళాలోకం

మహిళలను నమ్మించి మోసం చేసిన బాబు సర్కార్‌

ప్రజా తిరుగుబాటు ఖాయమని

హెచ్చరిస్తున్న మహిళలు

జిల్లాలో ఆడబిడ్డ నిధి వివరాలు

నియోజకవర్గం ఆడబిడ్డ నిధికి అర్హులు ఏడాదిగా అందాల్సిన

మొత్తం(కోట్లలో)

తిరుపతి 1,22,357 220..24

చంద్రగిరి 1,32,553 238.59

శ్రీకాళహస్తి 1,19,650 215.37

వెంకటగిరి 1,12,321 202.17

సత్యవేడు 1,03,757 186.76

సూళ్లూరుపేట 1,10,990 199.78

గూడూరు 99,845 179.62

మహాశక్తికి1
1/7

మహాశక్తికి

మహాశక్తికి2
2/7

మహాశక్తికి

మహాశక్తికి3
3/7

మహాశక్తికి

మహాశక్తికి4
4/7

మహాశక్తికి

మహాశక్తికి5
5/7

మహాశక్తికి

మహాశక్తికి6
6/7

మహాశక్తికి

మహాశక్తికి7
7/7

మహాశక్తికి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement