ఆటోలకు ఆధునిక కోడ్‌ | - | Sakshi
Sakshi News home page

ఆటోలకు ఆధునిక కోడ్‌

Jun 17 2025 6:51 AM | Updated on Jun 17 2025 6:51 AM

ఆటోలకు ఆధునిక కోడ్‌

ఆటోలకు ఆధునిక కోడ్‌

తిరుపతి క్రైమ్‌ : ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఆటోలకు ఆధునిక క్యూ ఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. సోమవారం తిరుపతిలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆటోలకు డిజిటల్‌ నంబర్‌ ప్లేట్ల నమోదును ఆయన ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రయాణికులు తాము ఎక్కిన ఆటోకు సంబంధించి పూర్తి వివరాలు క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయగానే వెల్లడికానున్నట్లు చెప్పారు. ప్రజలు సురక్షితంగా గమ్య స్థలానికి చేరేలా భరోసా కల్పించేందుకే డిజిటల్‌ నంబర్‌ ప్లేట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో డ్రైవర్‌ వివరాలతోపాటు ఏ ఫోర్‌ సైజ్‌ డిస్‌ప్లే బోర్డు, క్యూఆర్‌ కోడ్‌తో కూడిన రెండు స్టిక్కర్లు ఉంటాయన్నారు. క్యూఆర్‌ కోడ్‌ను గూగుల్‌ లెన్స్‌ ద్వారా స్కాన్‌ చేస్తే ట్రాక్‌ లోకేషన్‌, డ్రైవర్‌ పనితీరు, ప్రవర్త, అత్యవసర సమయాల్లో 112 నంబర్‌కు కాల్‌, సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌, అధికారుల నంబర్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు.

రికార్డులు అందించాలి

డిజిటల్‌ నంబర్‌ తీసుకోవాలంటే ఆటో ఓనర్‌, డ్రైవర్‌ తమ వాహనం పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వాహనానికి సంబంధించిన అన్ని రికార్డులతో పాటు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలను ట్రాఫిక్‌ పోలీసులకు అందజేయాలని సూచించారు. పోలీసులు ఈ వివరాలను ప్రత్యేక వెబ్‌సైట్‌లో నమోదు చేసి క్యూ ఆర్‌ కోడ్‌ ఇస్తారని వెల్లడించారు. నగరంలోని ఆటో డ్రైవర్లందరూ పోలీసులకు సహకరించి డిజిటల్‌ నంబర్‌ పొందాలని ఆదేశించారు. కార్యక్రమంలో పోలీస్‌ అధికారులు రవి మనోహరాచారి, నాగభూషణం, రామకృష్ణమాచారి, శ్యామసుందర్‌, భక్తవత్సలం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement