వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత
కేవీబీపురం : మండలంలోని ఓళ్లూరు గ్రామానికి చెందిన టీడీపీ నేత, ఉపాధి హామీ మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ లీలావతి వైఎస్సార్‌సీపీలో చేరారు. సోమవారం ఈ మేరకు పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. లీలావతి మాట్లాడుతూ సుమారు 25 ఏళ్లుగా టీడీపీకి సేవలందించానని, ఆ పార్టీలో నేతల కుట్రపూరిత వైఖరి నచ్చలేదన్నారు. వైఎస్సార్‌సీపీ విధి విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు బొర్రా మాధవీరెడ్డి ప్రోత్సాహంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 99 ఫిర్యాదులు
తిరుపతి క్రైమ్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 99 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. ఆయా అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు ఏటీజీహెచ్ వరకు బారులు తీరారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 90,815 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 35,007 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.52 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేనివారికి 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లో దర్శనమవుతోంది. ఈక్రమంలో సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వస్తే క్యూలో అనుమతించమని స్పష్టం చేసింది.
కాలువను కాపాడాలని వినతి
తిరుపతి రూరల్ : చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలోని ముక్కోటి ఆలయం వద్ద స్వర్ణముఖి నది నుంచి పేరూరు చెరువుకు వరద నీటిని తీసుకువచ్చే కాలువను కాపాడాలని ఎంపీపీ మూలం చంద్రమోహన్‌రెడ్డి కోరారు. సోమవారం ఈ మేరకు కలెక్టరేట్‌లో జేసీ శుభం బన్సల్‌కు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం జంక్షన్ నుంచి రేణిగుంట మండలం గాజులమండ్యం జంక్షన్ వరకు చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనుల్లో పేరూరు చెరువుకు నీరందించే కాలువను పూడ్చివేస్తున్నారని పేర్కొన్నారు. మళ్లీ కాలువ తవ్విస్తామని చెబుతున్నారని తెలిపారు. అయితే కాలువ నిర్మాణానికి ఇప్పుడే మార్కింగ్ వేయించి విస్తరణ పనులతో పాటు కాలువ నిర్మాణ పనులు కూడా పూర్తి చేయించాలన్నారు. పేరూరు చెరువులో నీరు చేరితే పలు పంచాయతీల ప్రజలకు దాహార్తి తీరుందని వివరించారు. స్పందించిన జాయింట్ కలెక్టర్ ఈ మేరకు నేషనల్ హైవేఅథారిటీ వారికి ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.
వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత
వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత


