మా ఊరు రూపు మార్చిన మహర్షి జగన్
తిరుపతి రూరల్: ‘‘మా ఊరు ఏర్పడినప్పటి నుంచి ఇంత అభివృద్ధి ఎప్పుడూ చూడలేదు. ఇలా మా ఊరు మారుతుందని కలలో కూడా ఊహించలేదు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా మా ఊరిలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతి నగరానికి వెళ్లాల్సి వచ్చేది. కనీసం పిల్లలకు అవసరమైన చిన్న సర్టిఫికెట్ కావాలన్నా సరే పదిసార్లు టౌన్‌కు వెళ్లే వాళ్లం. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే మా గ్రామంలోనే అన్నీ ఉన్నాయి. ఎలాంటి సమస్య వచ్చినా సరే పరిష్కారం చేయడానికి గ్రామ సచివాలయంలో ఉద్యోగులు అందుబాటులో ఉంటున్నారు. గతంలో ఆరోగ్యం బాగలేకుంటే ఒక నర్సు వచ్చి రెండు మందు బిళ్లలు ఇచ్చి వెళ్లేది. ఇప్పడు అత్యవసర వైద్యం అందించడానికి విలేజ్ క్లినిక్ మా ఊర్లోకే వచ్చింది. అనుకోని మహమ్మారి రోగాలు వస్తే తప్ప సాధారణ జబ్బులు అన్నింటికీ ఇక్కడే వైద్యం అందుతోంది. వ్యవసాయం చేయడానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, సలహాలన్నీ కూడా ఊరులోనే అందుతున్నాయి. గత ప్రభుత్వంలో జగనన్న ఆ ఊరుకి గ్రామ సచివాలయం, రైతు భరోసాకేంద్రం, మహిళాభవనం, విలేజ్ హెల్త్ క్లినిక్‌లను అందుబాటులోకి తెచ్చారు. గ్రామంలోని పాడుబడిన భవనంలో నడిచిన ప్రాథమిక పాఠశాల రూపు రేఖలు మార్చి కార్పొరేట్ తరహాలో భవనాలు నిర్మించి, సకల మౌలిక వసతులు కల్పించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లు మినహా ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా కనిపించని ఆ ఊరులో నేడు 15 మంది ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు అందుబాటులో ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే విద్య నుంచి విత్తనాల వరకు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంత చేయగలిగిన శక్తి, సామర్థ్యం ఒక్క జగనన్నకు మాత్రమే ఉంది.. మా ఊరు మారడమే కాదు.. మా బతుకులు కూడా మారాయి.. జగనన్నే మా నమ్మకం. మహర్షిలా మా ఊరును మార్చిన జగనన్నకు మా ఊరి ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా.
– విజయసింహారెడ్డి, గ్రామపెద్ద,
తనపల్లి, తిరుపతి రూరల్ మండలం
మా ఊరు రూపు మార్చిన మహర్షి జగన్


