శ్రీకాళహస్తిలో ముందస్తుగా జగన్ జన్మదిన వేడుకలు
శ్రీకాళహస్తి : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ముందస్తు జన్మదిన వేడుకలు శ్రీకాళహస్తిలో వైభవంగా ని ర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మ ధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభి మానులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి వేడుకలను విజయవంతం చేశారు. పట్టణమంతా వైఎస్సార్ సీపీ జెండాలు, నినాదాలతో ఉత్సాహభరితంగా మారింది. శ్రీకాళహస్తి వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు నిర్వహించిన భారీ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేతలు గజమాల వేశారు. అనంతరం జగనన్నకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. కార్యకర్తలు, అభిమానులకు అన్నదానం చేశారు. వాహనచోదకుల భద్రత కోసం జగనన్న జన్మదినాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నేతలకు హెల్మెట్లు పంపిణీ చేశారు.అలాగే సంప్రదాయ కళలను ప్రోత్సహించడమే లక్ష్యంగా డప్పు కళాకారులకు డప్పులు అందజేశారు.
శ్రీకాళహస్తిలో ముందస్తుగా జగన్ జన్మదిన వేడుకలు


