నేడు పల్స్‌ పోలియో | - | Sakshi
Sakshi News home page

నేడు పల్స్‌ పోలియో

Dec 21 2025 7:02 AM | Updated on Dec 21 2025 7:02 AM

నేడు పల్స్‌ పోలియో

నేడు పల్స్‌ పోలియో

తిరుపతి తుడా: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఎంపిక చే సిన పలు కేంద్రాల్లోనూ పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్టు డీఎంహెచ్‌ఓ డా క్టర్‌ బాలకృష్ణ నాయక్‌ తెలిపారు. శనివారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి ఆయన ర్యాలీని ప్రారంభించారు. జిల్లాలో 26 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 58 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో లక్ష్యం సాధన మేరకు 5 ఏళ్లలోపు పిల్లలు 2,59,843 మంది కాగా, వీరందరికీ పోలియో చుక్కలు అందించడానికి 1,868 పోలియా బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు. 84 మొబైల్‌ బూత్‌లను, 59 ట్రాన్సిస్టర్‌ బూత్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు.

మహిళా వర్సిటీలో

‘ఇన్‌స్పైరింగ్‌ మైండ్స్‌’పై సదస్సు

తిరుపతి రూరల్‌: శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని గణాంక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శనివారం ‘ఇన్‌స్పైరింగ్‌ మైండ్స్‌’పై సదస్సు నిర్వహించారు. స్కూల్‌ ఆఫ్‌ సైన్సెస్‌ డీన్‌ ప్రొఫెసర్‌ టి.సుధ, స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ డీన్‌, పీఎం ఉషా, కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ సి.వాణి, గణాంక శాస్త్ర విభాగం ఇన్‌చార్జి హెచ్‌ఓడీ డాక్టర్‌ ఎం.శివపార్వతి సదస్సులో పాలు పంచుకున్నారు. దక్షిణాఫ్రికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ జూలు ల్యాండ్‌ నుంచి వచ్చిన ప్రొఫెసర్‌ శ్యామల కృష్ణనాయర్‌, డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ ప్రత్యేక ఆహ్వానితులుగా ఆ సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో మొదటగా మద్రాస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ ఎం.ఆర్‌. సింధుమోల్‌ ‘స్టాటిస్టిక్స్‌ మైండ్‌‘ అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం, ప్రొఫెసర్‌ శ్యామల కృష్ణనాయర్‌ పరిశ్రమల్లో మల్టీస్కేల్‌ ప్రాసెస్‌ మానిటరింగ్‌, సింగులర్‌ స్పెక్ట్రమ్‌ డీకంపోజిషన్‌ వంటి అధునాతన పద్ధతులపై అవగాహన కల్పించారు.

23, 24 తేదీల్లో

మార్కెటింగ్‌పై అవగాహన

తిరుపతి అర్బన్‌: ఎంఎస్‌ఎంఈ యజమాన్యానికి ఈ నెల 23, 24 తేదీల్లో కలెక్టరేట్‌ సమీపంలోని లెమన్‌ట్రీ హోటల్‌లో వ్యాపార విస్తరణపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనున్నారని సమాచారశాఖ అధికారులు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌కు చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైనింగ్‌, ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చెందిన వ్యాపారులు హజరుకావడానికి ఈ నెల 22వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. అదనపు సమాచారం కోసం 9885429054, 9989094777 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

శ్రీవారి దర్శనానికి

12 గంటలు

తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,729 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,162 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.31 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement