ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విప్లవం
తిరుపతి సిటీ:‘‘మాది తిరుపతి. నగరంలోని వైఎస్సార్ మార్గ్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ పాఠశాలల్లో మేము పదో తరగతి చదువుతున్నాం. నగరంలోని మా పాఠశాలను జగనన్న సీఎం అయిన తర్వాత నాడు–నేడు నిధులతో మూడు అంతస్తుల భవనం నిర్మించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల గదులు, ప్రతి క్లాస్ రూమ్‌లో డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిపుణులైన ఉపాధ్యాయులతో ప్రాక్టికల్‌గా డిజిటల్ స్రీన్‌పై పాఠాలను బోధిస్తున్నారు. స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టీవ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా బోధిస్తుంటే ప్రతి అంశాన్ని నేరుగా చూస్తూ, సులువుగా అర్థం చేసుకుంటున్నాం. గతంలో పాఠశాలలో వాష్ రూమ్‌లు ఉండేవి కాదు. ఆరు బయటకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తు తం బాలబాలికలకు ఆధునాతనమైన బాత్ రూమ్‌లు, తరగతి గదుల్లో ఆకట్టుకునేలా డెస్క్‌లు ఏర్పాటు చేశారు. గతంలో జగనన్న గోరు ముద్ద ద్వారా 16 రకాల పదార్థాలతో ప్రత్యేక మెనూను రూపొందించి నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా అందించారు. గతంలో తెలుగు మీడియం మాత్రమే ఉండేది. జగన్ సార్ సీఎం అయిన తర్వాతనే మా స్కూల్‌లో పూర్తి స్థాయి ఇంగ్లీషు మీడియంగా మారింది. అమ్మఒడి ఏటా క్రమం తప్పకుండా మా అమ్మ ఖాతాలో జమచేయడంతో మా చదువుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగేది. జగనన్న విద్యా కానుక ఎంతో నాణ్యతతో అందించారు. అప్పటి బూట్లు, బ్యాగులు ఇప్పటికీ మేము వాడుతున్నాం. జగన్‌మోహన్ రెడ్డి మళ్లీ రావాలని కోరుకుంటున్నాం. జగన్ మామయ్య మీకు జన్మదిన శుభాకాంక్షలు.’’ – వెంకటేష్,
జగదీష్, పదో తరగతి విద్యార్థులు,
డాక్టర్ ఎస్‌ఆర్‌కే మున్సిపల్ స్కూల్, తిరుపతి


