
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడలో ఆదివారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు ఇళ్ల ముందు విచిత్రమైన ముగ్గులు, నిమ్మకాయలతో క్షుద్రపూజలు చేశారు. కాలనీవాసులు సోమవారం ఉదయం లేచి చూసేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కన్పించడంతో ఆందోళన చెందుతున్నారు.