Hyderabad: మరో మూడు రోజులు వర్షాలే! | Weather Forecast Hyderabad And Surroundings Witness Heavy Rains | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌.. మరో మూడు రోజులు వర్షాలే.. ఈదురుగాలులతో పాటు వడగండ్ల వాన

Apr 17 2023 9:29 PM | Updated on Apr 17 2023 9:32 PM

Weather Forecast Hyderabad And Surroundings Witness Heavy Rains - Sakshi

పగలంతా అధిక ఉష్ణోగ్రతలు, మధ్యాహ్నం లేదంటే సాయంత్రం పూట

సాక్షి, హైదరాబాద్‌: నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో మూడు రోజులు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. ఈదురు గాలులతో పాటు వడగండ్ల వాన సైతం కురవొచ్చని తాజా బులిటెన్‌లో తెలిపింది. 

పగలంతా అధిక ఉష్ణోగ్రతలు, మధ్యాహ్నం లేదంటే సాయంత్రం పూట వాతవరణంలో మార్పులు రావొచ్చని తెలిపింది. సోమవారం నాటి పరిస్థితులే మరో మూడు నాలుగు రోజులపాటు కొనసాగొచ్చని పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాభావం కొనసాగొచ్చని తెలిపింది వాతావరణ శాఖ.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement