వైఎస్సార్‌ పాలనను తిరిగి తెస్తాం: షర్మిల

We will bring back YSR rule in Telangana: YS Sharmila - Sakshi

సాక్షి, రామన్నపేట: వైఎస్సార్‌ కాలం నాటి సంక్షేమ పాలనను తిరిగి తీసుకురావడమే వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చెప్పారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం, వెల్లంకి, గొల్నేపల్లి గ్రామాల మీదుగా 10 కి.మీ. సాగింది. ఆయా గ్రామాల ప్రధాన కూడళ్లలో జరిగిన సభల్లో ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రజలు ఆశీర్వదించి అధికారమిస్తే రాజన్నబిడ్డగా చివరిక్షణం వరకు తెలంగాణ ప్రజల బాగు కోసం పాటుపడతానని హామీ ఇచ్చారు.

వైఎస్‌ తన ఐదేళ్ల పాలనలో ఎలాంటి పన్నులు విధించకుండా అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి మోడల్‌ సీఎంగా నిలిచారని అన్నారు. పారదర్శక పాలన అందించాలనే పరితపించి ప్రజలవద్దకు వెళ్తుంటే ప్రాణాలు వదిలాడని భావోద్వేగంతో చెప్పారు. రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, యువకుల ఆత్మహత్యలు సీఎం కేసీఆర్‌కు పట్టడం లేదని విమర్శించారు. ఆమె వెంట పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి, జిల్లా కో–ఆర్డినేటర్‌ మహ్మద్‌అత్తార్‌ తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top