
సాక్షి, ములుగు: జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బోరు నుంచి కరెంటు లేకుండానే గంగమ్మ పైకి ఉబిగి వస్తోన్న దృశ్యం ములుగు మండలంలోని శివ తండాలో మంగళవారం వెలుగు చూసింది. తండాకు చెందిన ధరవత్ అనే రైతు పోలంలోకి వెళ్లేసరికి బోరు నుంచి నీరు బయటకు రావడం గమనించాడు. అక్కడకు వెళ్లి చూడగా కరెంటు లేకుండాను బోరు నుంచి నీరు పైకి రావడం చూసి రైతు ధరవత్ హర్షం వ్యక్తం చేశాడు. అలాగే ఈ సంఘటన గురించి తోటి రైతులకు తెలిపాడు. అయితే గత రోజులుగా ఏకాదాటిగా కురిసిన వర్షాలకు భుగర్భ జాలాల నీరు పెరగడంతో ఇలా నీరు పైకి వచ్చినట్లు అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.