తుపాకీతో హెడ్‌కానిస్టేబుల్‌ హల్‌చల్‌ 

Warangal AR Constable To Terrorize People With Gun - Sakshi

కేసు నమోదు చేసిన ఉన్నతాధికారులు

సాక్షి, వరంగల్‌/రామన్నపేట: వరంగల్‌ నగరంలోని గోపాలస్వామి గుడి వద్ద ఆర్ముడ్‌ రిజర్వ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ తుపాకీతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎంజీఎం ఆస్పత్రి ప్రిజనరీ (ఖైదీల) వార్డు వద్ద విధులు నిర్వర్తిస్తున్న కొండవీటి విఘ్నేశ్వర బాలప్రసాద్‌ శనివారం రాత్రి భోజనానికి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో అతిగా మద్యం సేవించి తన వద్ద ఉన్న తుపాకీతో ప్రజలను బెదిరించడం మొదటుపెట్టాడు.

ఇది గమనించిన స్థానికులు 100 నంబర్‌కు డయల్‌ చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతడి నుంచి తుపాకీ స్వాధీనం చేసుకోవడంతో పాటు, రక్త నమూనాలు సేకరించారు. అనంతరం మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. హెడ్‌కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్‌ ఏసీపీ గిరికుమార్‌ తెలిపారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top