వావ్‌.. కుంటాల జలపాతం వద్ద ‘వాచ్‌టవర్’..

Wall Tower Near Kuntala Water Falls In Nirmal - Sakshi

సాక్షి, నేరడిగొండ(నిర్మల్‌): రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతంగా పేరొందిన కుంటాల జలపాతం వద్ద రూ.10లక్షలతో నిర్మించిన వాచ్‌టవర్‌ను ఆదివారం పీసీసీఎఫ్‌ శోభ, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌తో కలిసి ప్రారంభించారు. వాచ్‌టవర్‌కు ఊటచెలిమ కుంటాల వాచ్‌టవర్‌గా నామకరణం చేశారు. జలపాతం ‘యూ’ పాయింట్‌ వద్దకు వెళ్లి జలపాతం అందాలను తిలకించారు. కుంటాల(కె) సర్పంచ్‌ ఎల్లుల్ల అశోక్, వీఎస్‌ఎస్‌ చైర్మన్‌ నర్సయ్యలు కుంటాల జలపాతానికి వచ్చే పర్యాటకులకు మెట్ల ద్వారా దిగడం ఇబ్బందిగా ఉందని, జలపాతం వద్ద రూప్‌వే ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారి దృష్టికి తీసుకెళ్లారు.

అయితే జలపాతం అభయారణ్యంలో ఉందని, రూప్‌వే నిర్మాణం సాధ్యం కాదన్నారు. వీరి వెంట సీఎఫ్‌ రామలింగం, డీఎఫ్‌వో రాజశేఖర్, ఉట్నూర్‌ ఎఫ్డీవో రాహుల్‌కిషన్‌ జాదవ్, నేరడిగొండ, సిరిచెల్మ ఎఫ్‌ఆర్‌వోలు రవికుమార్, వాహబ్‌ అహ్మద్, ఎఫ్‌ఎస్‌వో వసంత్‌కుమార్, ఎఫ్‌బీవో రాధకృష్ణ, అటవీ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top