చౌటుప్పల్‌లో హైవేపై వాహనాల బారులు | Vehicles Stuck On Choutuppal Highway Due Sankranti | Sakshi
Sakshi News home page

చౌటుప్పల్‌లో హైవేపై వాహనాల బారులు

Jan 14 2022 2:22 AM | Updated on Jan 14 2022 2:37 AM

Vehicles Stuck On Choutuppal Highway Due Sankranti - Sakshi

చౌటుప్పల్‌ రూరల్‌: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న వారితో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. హైదరాబాద్‌ నుంచి పెద్ద ఎత్తున వెళ్లిన కార్లు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ ప్లాజా వద్ద గురువారం రాత్రి క్యూ కట్టాయి.

హైవేపై నిత్యం 30వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, గురువారం మరో 10వేల వాహనాలు అదనంగా వెళ్లినట్టు టోల్‌ప్లాజా నిర్వాహకులు తెలిపారు. భువనగిరి డీసీపీ కె.నారాయణరెడ్డి టోల్‌ప్లాజాను గురువారం మధ్యాహ్నం సందర్శించి, వాహనాల రద్దీని పరిశీలించారు. 

గూడూరు టోల్‌ప్లాజా దగ్గరా... 
బీబీనగర్‌: హైదరాబాద్‌–వరంగల్‌ హైవేపై బీబీనగర్‌ మండలంలోని గూడూరు టోల్‌ప్లాజా వద్ద కూడా గురువారం పండుగ రద్దీ కనిపించింది. నగరం నుంచి భారీగా ప్రజలు పండుగకు గ్రామాలకు వెళ్తుండడంతో టోల్‌గేట్‌ వద్ద వాహనాలు బారులు తీరాయి.    

Advertisement
 
Advertisement
Advertisement