Photo Feature: సరదా సైకిల్‌! | Unicycle 4 Hours Charge 100 Km Mileage Operate With Phone Hyderabad | Sakshi
Sakshi News home page

Photo Feature: సరదా సైకిల్‌!

Apr 17 2022 11:51 AM | Updated on Apr 17 2022 12:52 PM

Unicycle 4 Hours Charge 100 Km Mileage Operate With Phone Hyderabad - Sakshi

కొత్తగా.. వింతగా.. ఆశ్చర్యంగొలిపేలా ఉన్న ఈ వాహనాన్ని చూశారా. దీనిని యూనీ సైకిల్‌ అంటారు. 4 గంటలు చార్జింగ్‌ పెడితే సుమారు 100 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. యూనీసైకిల్‌పై ఒక వ్యక్తి మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. రహదారులపై సిగ్నల్‌ పడినప్పుడు ఆపుకొనేలా బ్రేక్‌లున్నాయి. వేగాన్ని నియంత్రించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇవన్నీ చేతిలోని ఫోన్‌ ద్వారా ఆపరేట్‌ చేసుకోవచ్చు.

ఇప్పటిదాకా ఈ యూనీసైకిల్‌ భారతీయ విపణిలోకి విడుదల కాలేదు. మరి దీనిపై వెళ్తున్న వ్యక్తికి ఇది ఎలా వచ్చిందనేగా మీ అనుమానం. నగరానికి చెందిన ఓ యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు తన సోదరి అమెరికా నుంచి బహుమతిగా పంపించారు. నిత్యం ఇంటి నుంచి ఆఫీస్‌కు దీనిపైనే వెళ్లి వస్తున్నట్లు అతడు చెప్పారు. ఈ దృశ్యం శనివారం బీఎన్‌రెడ్డి నగర్‌ వద్ద ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. 

– గడిగె బాలస్వామి, సాక్షి, ఫొటోగ్రాఫర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement