TSSPDCL Notification 2022: జేఎల్‌ఎంల పోస్టులకు పదేళ్ల ‘వయో’ సడలింపు లేదు

TSSPDCL Recruitment 2022 Clarity No Age Relaxation For Junior Lineman Posts - Sakshi

శారీరక దారుఢ్యం ఆవశ్యకత దృష్ట్యా టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌:  దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) భర్తీ చేయనున్న జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం) పోస్టులకు 10 ఏళ్ల గరిష్ట వయోపరి మితి సడలింపును వర్తింపజేయడం లేదు. విద్యుత్‌ స్తంభాలను ఎక్కి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో విధులు నిర్వహించే జూనియర్‌ లైన్‌మెన్‌కు శారీరక దారుఢ్యం అత్యంత ఆవశ్యకమని, అందువల్ల ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి సడలింపు ఇవ్వరాదని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ నిర్ణయించింది.

1,000 జేఎల్‌ఎం, 201 సబ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌), 70 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి సంస్థ ఈ నెల 9న సంక్షిప్త ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా అసిస్టెంట్‌ ఇంజనీర్, సబ్‌ ఇంజనీర్‌ పోస్టుల కు మాత్రం 10 ఏళ్ల గరిష్ట వయోపరి మితి సడలింపును వర్తింపజేయనున్నట్టు సంస్థ ఉన్నతాధికారవర్గాలు తెలిపాయి.  

జేఎల్‌ఎం, సబ్‌ ఇంజనీర్‌ జిల్లా స్థాయి పోస్టులే 
కొత్త జోనల్‌ విధానం ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. జేఎల్‌ఎం, సబ్‌ ఇంజనీర్‌ పోస్టులను జిల్లా స్థాయి పోస్టులుగా వర్గీకరించి భర్తీ చేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాల స్థానికత గల అభ్యర్థులకే 95 శాతం పోస్టులు దక్కనున్నాయి. ఐటీఐ (ఎలక్ట్రికల్‌)తో పాటు అప్రెంటిస్‌ పూర్తి చేసిన అభ్యర్థులు జేఎల్‌ఎం పోస్టులకు అర్హులు. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన వారు సబ్‌ ఇంజనీర్‌ పోస్టులకు అర్హులు కానున్నారు.  

డిస్కం స్థాయి పోస్టులుగా ఏఈ 
అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికే షన్‌ వెలువడింది. గురువారం నుంచి వచ్చే నెల 3 వరకు దరఖాస్తులను స్వీకరించను న్నారు. జూలై 17న రాత పరీక్ష జరగనుంది. ఎలక్ట్రికల్‌ లేదా ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో ఇంజనీరింగ్‌ డిగ్రీ కలిగి ఉండి 18–44 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు మరో ఐదేళ్లు, శారీర క వికలాంగులకు మరో 10 ఏళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు వర్తించనుంది.

ఏఈ పోస్టుల ను కొత్త జోనల్‌ విధా నం కింద టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని పోస్టులుగా విభ జించారు. సంస్థ పరిధిలోని 16 జిల్లాల అభ్యర్థులు 95% పోస్టుల కోసం పోటీపడడానికి అర్హులు. ఏఈ పోస్టుల నోటిఫికేషన్‌ను సంస్థ వెబ్‌సైట్‌ https://tssouthernpower.cgg.gov.in లో చూడవచ్చు. జేఎల్‌ఎం, సబ్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top