పేపర్‌ లీక్‌ కేసు: సిట్‌ ఆఫీస్‌లో ముగిసిన అనితా రామచంద్రన్‌ విచారణ

TSPSC paper Leak Case: Anita Ramachandran AT SIT  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజ్‌ కేసులో సిట్‌ దర్యాప్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకాలం లీకేజీ రాయులు, అభ్యర్థులు, టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులనే ప్రశ్నించిన దర్యాప్తు బృందం, ఇప్పుడు ఏకంగా కమిషన్‌లోని సభ్యులపైనే దృష్టిసారించింది. ఈ క్రమంలో.. ఇవాళ కమిషన్‌ సెక్రెటరీ అనితా రామచంద్రన్‌(ఐఏఎస్‌)ను సిట్‌ విచారించింది.  

శనివారం ఉదయం హిమాయత్‌నగర్‌లోని సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు అనితా రామచంద్రన్‌. సుమారు రెండు గంటలపాటు ఆమెను సిట్‌ చీఫ్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలోని టీం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సిట్‌ అధికారులు ఈ మేరకు ఆమె నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.  

ప్రశ్నాపత్రాల తయారీ, వాటిని భద్రపర్చడం తదితర వ్యవహరాలన్నీ కాన్ఫిడెన్షియల్‌ విభాగం పరిధిలోనే ఉంటాయి. ఈ విభాగం పూర్తిగా సెక్రెటరీ అయిన అనిత పర్యవేక్షణలోనే ఉంటుంది. అయితే కాన్ఫిడెన్షియల్‌ విభాగంలో పని చేసే శంకర్ లక్ష్మి కంప్యూటర్‌ని హ్యాక్ చేసి.. ప్రశ్నాపత్రాలు కొట్టేసినట్లు సిట్‌ ఇదివరకే ధృవీకరించుకుంది. ఈ నేపథ్యంలోనే అనితా రామచంద్రన్‌ను సిట్‌ విచారించింది. మరోవైపు పేపర్‌ లీకేజ్‌లో నిందితుడిగా ఉన్న రమేష్‌,  కమిషన్‌ సభ్యుడైన లింగారెడ్డికి పీఏగా తెలుస్తోంది. వీరిద్ధిరి మధ్య సత్సబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. అనితకు, లింగారెడ్డిలకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 91, సెక్షన్‌ 160ల ప్రకారం వీళ్లిద్దరికీ సిట్‌ నోటీసులు జారీ చేసింది.  అనితా రామచంద్రన్‌, లింగారెడ్డిలు అందించే వివరాలను బట్టి.. సిట్‌ కమిషన్‌లోనే మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top