Munugode Bye-Election 2022: TRS, BJP Trying To Lure Munugode Voters With Money - Sakshi
Sakshi News home page

మునుగోడు ఉప ఎన్నిక: కాస్ట్‌లీ ఓటు కుటుంబానికి రూ.40 వేలు!

Oct 11 2022 8:05 AM | Updated on Oct 11 2022 8:43 AM

TRS, BJP Trying To Lure Munugode Voters With Money - Sakshi

పారదర్శక టెండర్ల ద్వారానే కాంట్రాక్టు దక్కింది. రాజకీయంగా ఎదుర్కోలేకే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. లేకపోతే టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలి. తడిబట్టలతో యాదాద్రి ఆలయం గర్భగుడికి రండి ప్రమాణం చేద్దాం. 
– బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాకు ఛాలెంజ్‌ చేస్తున్న. ఆ రూ.18 వేల కోట్లు మునుగోడు, నల్లగొండ అభివృద్ధికి ఇవ్వండి. ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రాధేయపడైనా ఒప్పిస్తా. ఒక వ్యక్తి కోసం రూ.18 వేల కోట్లు ఇవ్వడం ఏంటి. ఆయన సొంతానికి ఇచ్చే సొమ్ము జిల్లా అభివృద్ధికి ఇవ్వండి.    
 విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

ఎనిమిది సంవత్సరాల్లో కనీసం రోడ్డు వేయలేని వారు ఓటు అడగడానికి వస్తున్నారు. బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డిండి ప్రాజెక్టుకు రూ.5 వేల కోట్లు నిధులు ఇప్పించాకే మునుగోడులో ఓటు అడగాలి. టీఆర్‌ఎస్‌ సర్కారు భీమనపల్లికి కనీసం రోడ్డు కూడా వేయలేదు.
– టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. రెండు రోజుల నుంచి నియోజకవర్గం మొత్తం ప్రధాన పార్టీల అభ్యర్థులు, ముఖ్య నాయకుల ప్రచారాలతో మారుమోగిపోతోంది. ఎక్కడ చూసినా ప్రచార కార్యక్రమాలే. పోటాపోటీగా సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్‌ షోలతో హోరెత్తుతోంది. వాటిల్లో పాల్గొన్న పార్టీల ముఖ్య నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. సోమవారం నియోజకవర్గంలో మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వíßహించారు. ఓవైపు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మరోవైపు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సవాల్‌.. ప్రతి సవాల్‌ చేసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటు బీజేపీ, అటు టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేశారు. 

పోటాపోటీగా విమర్శలు
ప్రచారంలో పాల్గొంటున్న నేతలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రచార పర్వంలో రాజగోపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలనను టార్గెట్‌ చేస్తే.. రాగోపాల్‌రెడ్డిని టార్గెట్‌ చేసి మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శల బాణం ఎక్కు పెట్టారు. పరస్పర విమర్శలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోమవారం నామినేషన్‌ వేశాక రాజగోపాల్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలన, చూపుతున్న వివక్షను ఎత్తిచూపుతూ తనపై చేస్తున్న అసత్య ఆరోపణలను నిరూపించాలంటూ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి కొరటికల్‌ గ్రామంలో నిర్వహించిన రోడ్‌ షోలో రాజగోపాల్‌రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారని, ఆ ని«ధులేవో మునుగోడు, జిల్లా అభివృద్ధికి ఇస్తే పోటీ నుంచే తప్పుకుంటామని, అందుకు సిద్ధమేనా? అని ఛాలెంజ్‌ చేశారు.  మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అటు బీజేపీ, ఇటు టీఆర్‌ఎస్‌ పార్టీలను, నేతలను టార్గెట్‌ చేసి మాట్లాడుతున్నారు. శివన్నగూడెం నిర్వాసితులకు న్యాయం జరగాలని, వారి తరఫున ఉండి కొట్లాడతామని, తమకు ఒక్కసారి అవకాశం ఇచ్చి స్రవంతిని గెలిపించాలని శివన్నగూడెంలో జరిగిన రోడ్‌షోలో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

నియోజకవర్గానికి తరలివస్తున్న నోట్ల కట్టలు
మునుగోడులో భారీగా డబ్బు కుమ్మరించేందుకు రంగం సిద్ధమైంది. ఇన్నాళ్లుగా నియోజకవర్గంలో, మండలాలు, గ్రామాల్లో ప్రభావం చూపగలిగే నాయకులు, ఓటర్లకు ఎర వేసి చేరికలను జోరుగా చేరికలను ప్రోత్సహిస్తున్న పార్టీలు ఇప్పుడు ఓటర్లను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డాయి. పొద్దంతా ప్రచారం కొనసాగిసూ్తనే పగలు వీలు చిక్కినప్పుడు, రాత్రంతా మంతనాలు సాగిస్తున్నాయి. వారికి మట్టుజెప్పేందుకు అవసరమైన డబ్బును నియోజకవర్గానికి తరలిస్తున్నట్లు తెలిసింది. నలుగురు సభ్యులు ఉన్న ఒక్కో కుటుంబానికి రూ. 40 వేలు ఇస్తామని ఇంటి యజమానులను, బంగారం ఇస్తామంటూ మహిళలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement