Threatening Calls To TRS MLA Rohit Reddy On Farmhouse Case - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో షాకింగ్‌ ట్విస్ట్‌.. రోహిత్‌ రెడ్డికి ఊహించని ఫోన్‌ కాల్స్‌!

Nov 13 2022 11:20 AM | Updated on Nov 13 2022 1:30 PM

Threatening Calls To TRS MLA Rohit Reddy On Farmhouse Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌ హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా, కేసులో ఇప్పటికే నిందితులను సిట్‌ విచారణ వేగవంతం చేసింది. 

ఇదిలా ఉండగా.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి బెదిరింపు కాల్స్‌ వచ్చినట్టు తెలిపారు. ఈ క్రమంలో మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు రోహిత్‌ రెడ్డి. తనకు యూపీ, గుజరాత్‌కు చెందిన 11 నెంబర్ల నుంచి కాల్స్‌ వచ్చాయని ఫిర్యాదులో​ పేర్కొన్నారు. తనను హత్య చేస్తామంటూ బెదిరించనట్టు రోహిత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. 

మరోవైపు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో​ సిట్‌ విచారణ వేగవంతం చేసింది. ముగ్గురు ఎమ్మెల్యేల స్టేట్‌మెంట్స్‌ రికార్డు చేసింది సిట్‌ బృందం. ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి నివాసానికి వెళ్లి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. నిందితులు ఎలా సంప్రదించారనే కోణంలో సిట్‌ విచారణ చేపట్టింది. రూ. 100 కోట్ల డీల్‌పై ఫాంహౌస్‌లో​ ఏం మాట్లాడారనే అంశంపై విచారణ జరిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement