ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

Telangana: Women Gives Birth To Three Babies In Bhadradri Kothagudem district - Sakshi

ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలకు జన్మనిచ్చిన మహిళ 

భద్రాచలం అర్బన్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులకు జన్మనిచ్చింది. బూర్గంపాడు మండలం రెడ్డిపాలెంకు చెందిన నవ్య అనే మహిళ కాన్పు కోసం శుక్రవారం భద్రాచలంలోని సరోజిని ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. ఆమెకు నొప్పులు తీవ్ర స్థాయిలో రావడంతో వైద్యులు సిజేరియన్‌ ద్వారా కాన్పు చేశారు.

తొలుత కవలలు ఉన్నట్టు భావించినా.. ముగ్గురు మగ శిశువులు జన్మించారని, తల్లీ, ఇద్దరు బిడ్డలు క్షేమంగా ఉన్నారని డాక్టర్‌ సరోజిని తెలిపారు. మరో బిడ్డ కొంత అస్వస్థతగా ఉండడంతో వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. 

అస్వస్థతగా ఉన్న శిశువుకి వైద్యం అందిస్తున్న దృశ్యం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top