
ఆరు నెలలుగా అనవసరంగా 77 సార్లు డయల్ 100కి కాల్
విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు నమోదు
సంగారెడ్డి జిల్లా(నారాయణఖేడ్): పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం పెద్దముబారక్‌పూర్‌లో శుక్రవారం వెలుగులోకి వచి్చంది. ఎస్‌ఐ డీ.వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. పెద్దముబారక్‌పూర్ గ్రామానికి చెందిన నాయకిని సురేశ్ మద్యానికి బానిసయ్యాడు. రోజుకో పేరు, ఊరు పేరు మార్చుకుంటూ సాయంత్రం కాగానే డయల్ 100కు కాల్ చేయడం మొదలు పెట్టాడు.
భార్య తప్పిపోయింది.. పెట్రోల్ పోసుకుంటున్నా.. మందు తాగి చనిపోతున్నా.. అంటూ రోజుకో మాట చెబుతూ డయల్ 100కు కాల్ చేశాడు. పోలీసులు వెళ్తే ఎవరూ ఉండేది కాదు. ఆరు నెలలుగా రోజూ పోలీసులకు చుక్కలు చూపించాడు. విసిగిపోయిన పోలీసులు డయల్ 100కు ఎవరూ కాల్ చేస్తున్నారనే కోణంలో విచారణ చేపట్టారు. సంబంధిత వ్యక్తి ఎవరని గుర్తించారు. ఎట్టకేలకు సురేశ్‌ను పట్టుకొని కేసు నమోదు చేశారు. ఎవరైనా డయల్ 100కు అనవసరంగా కాల్ చేస్తే చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి హెచ్చరించారు.