సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ | Telangana High Court Gives Green Signal For Singareni Elections | Sakshi
Sakshi News home page

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

Dec 21 2023 11:46 AM | Updated on Dec 21 2023 2:48 PM

Telangana High Court Green Signal For Singareni Elections - Sakshi

సింగరేణి ఎన్నికల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు మొత్తానికి.. 

సాక్షి,హైదరాబాద్‌: సింగరేణి ఎన్నికల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరిపేందుకు వీలు కలిపిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు వాయిదా వేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను కొట్టేసింది. 

సింగరేణికి నాలుగేళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే ఏడాది నుంచి హైకోర్ట్‌లో సింగరేణి ఎన్నిక వివాదం నడుస్తోంది. ఎన్నికల  నిర్వహణపై గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్న హైకోర్టు.. ఇప్పటికే పలుమార్లు ఉత్తర్వులు జారీ చేసింది. 

అయితే.. కేంద్ర కార్మిక శాఖ ఎన్నికలకు సిద్ధమైంది.  ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా విడుదలై.. ఎన్నికల నిర్వహణ కసరత్తులు జరుగుతున్నాయి.   ఈ తరుణంలో ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్‌ దాఖలుకు ఆదేశించింది. ఆపై పిటిషన్‌పై విచారణ జరుపుతూ వచ్చింది.


రాష్టంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టడం తో పాటు వివిధ విభాగాల సమీక్ష, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ వెంటనే పార్లమెంట్‌ ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నందున వాయిదా వేయాలని ఇంధన, వనరుల శాఖ కోరింది. మార్చిలో నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ శాఖ కార్యదర్శి పేరిట పిటిషన్‌ దాఖలైంది. అదే సమయంలో వాయిదా యత్నాలను పసిగట్టి ముందే కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ఏఐటీయూసీ సంఘం. దీంతో ఇంధన, వనరుల శాఖ కార్యదర్శి పిటిషన్ పై స్టే ఇవ్వకుండా విచారణ చేపట్టింది హైకోర్టు. చివరకు.. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement