కాంగ్రెస్‌ ‘సామాజిక అస్త్రం’.. భారత్‌ జోడో యాత్రకు తోడు రాజ్యాంగ పరిరక్షణ కవాతు ప్రణాళిక

TCongress To Plan For Organizing Constitution Protection Parade - Sakshi

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పక్షాన తెలంగాణలో 75 కిలోమీటర్ల మార్చ్‌

సామాజిక న్యాయం, బీజేపీ పాలనలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి అంశాలే ఎజెండా

వచ్చే నెల 4న రాష్ట్రానికి దిగ్విజయ్, జైరాం రమేశ్‌... కవాతు నిర్వహణపై సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు అదనంగా రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ కవాతు (సంవిధాన్‌ బచావో మార్చ్‌) నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలను తమవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా 2 వారాలపాటు కవాతు నిర్వహించనుంది. దీనిపై చర్చించేందుకు వచ్చే నెల 4న కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేశ్‌ హైదరాబాద్‌ రానున్నారు.

నవంబర్‌ 3వ వారం తర్వాత..
రాహుల్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర అక్టోబర్‌ నెలాఖరులో రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 24న నారాయణపేట జిల్లా నుంచి తెలంగాణ లోకి రావాల్సిన యాత్ర 3–4 రోజులు ఆల స్యం కావొచ్చని గాంధీ భవన్‌ వర్గాలు చెబు తున్నాయి. అక్టోబర్‌ 26 నుంచి నవంబర్‌ 1లోగా ఏదో ఒకరోజు తెలంగాణలోకి యాత్ర వస్తుందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ యాత్ర కనీసం 13 రోజులపాటు జరగ నుంది.

అంటే నవంబర్‌ మూడో వారం వరకు రాహుల్‌ యాత్ర రాష్ట్రంలో జరగనుండగా ఆ తర్వాత 75 కి.మీ. రాజ్యాంగ పరి రక్షణ కవాతు ప్రారంభించాలని టీపీసీసీ నేతలు యోచిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో నూ ఇలాంటి యాత్రలు చేపడుతున్నారని, అయితే తెలంగాణలో మాత్రం ఇతర రాష్ట్రా లకు భిన్నంగా కవాతు నిర్వహించాలనేది రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. ఇందుకోసం టీపీసీసీకి అనుబంధంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రాజీవ్‌ గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్, వృత్తి దారులు, కిసాన్, ఫిషర్‌మెన్‌ సెల్‌లను భాగ స్వాములను చేస్తూ యాత్ర నిర్వహిస్తామని టీపీసీసీ నేతలు చెబుతున్నారు.

అన్యాయాన్ని వివరించడమే లక్ష్యంగా..
కాంగ్రెస్‌ హయాంలో ఆయా వర్గాలకు ఇచ్చి న ప్రాధాన్యం గురించి చెప్పడంతోపాటు బీజేపీ, టీఆర్‌ఎస్‌ల హయాంలో ఆయా వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని వివ రించడమే లక్ష్యంగా యాత్ర సాగుతుందని, భారత్‌ జోడో యాత్రకు ఎంత ప్రాధాన్య మి చ్చామో సామాజిక కవాతుకూ అంతే ప్రాధా న్యమిస్తామని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు.

కవాతు ఏర్పాట్లపై చర్చించేందుకు పార్టీ ముఖ్య నాయకులు దిగ్విజయ్‌ సింగ్, జైరాం రమేశ్‌ వచ్చే నెల 4న హైదరా బాద్‌కు రానున్నారు. ఈ సమావేశానికి హాజ రుకావాలంటూ పార్టీ అనుబంధ విభాగాల చైర్మన్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్‌లకు ఏఐసీసీ సమన్వయకర్త కొప్పుల రాజు లేఖలు కూడా రాశారు. ఈ సమావేశంలోనే కవాతు ఎక్కడ ప్రారంభించి, ఎక్కడ ముగించాలి, ముగింపు సందర్భంగా నిర్వ హించే బహిరంగ సభకు ఎవరిని ఆహ్వానించాలన్న దానిపై స్పష్టత రానుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top