తాండూరు కోసమే పెద్ద రిస్క్‌ చేశా.. లేకపోతే రూ.100 కోట్లు తీసుకుని హ్యాపీగా ఉండేవాణ్ణిగా..

Tandur TRS MLA Pilot Rohit Reddy Phone Call Viral - Sakshi

బషీరాబాద్‌: నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ‘ఎమ్మెల్యేల ఎర కేసు’లో తాను పెద్ద రిస్క్‌ తీసుకున్నానని వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. బషీరాబాద్‌ మండలం మల్కన్‌గిరి గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలని కోరుతూ గ్రామ యువకులు కొందరు వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దీక్ష చేస్తున్న బాలకృష్ణ అనే యువకుడితో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ‘తాండూరు అభివృద్ధి కోసం ఇంత పెద్ద రిస్క్‌ తీసుకున్నా. లేకుంటే వాళ్లు ఇచ్చే వంద కోట్ల రూపాయలు తీసుకొని నేను హ్యాపీగా ఉంటాను కదా. కానీ నేను మన కోసం రిస్క్‌ తీసుకున్నా. మీ గ్రామం అభివృద్ధికి ఏమేమి కావాలో నాకు లెటర్‌ రాయండి. మీ గ్రామం డెవలప్‌మెంట్‌ నేను చూసుకుంటా. సమస్యను నా దృష్టిలో పెట్టుకుంటా. ప్రభుత్వం ముందు ప్రపోజల్‌ చేస్తా..’అని తెలిపారు.

నా కోసం దీక్ష విరమించాలని కోరారు. కాగా వారం రోజుల్లో మల్కన్‌గిరి గ్రామానికి రూ.25 లక్షల నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు దీక్ష చేస్తున్న యువకులు చెప్పారు. రిలే దీక్షలు విరమిస్తున్నట్లు తెలిపారు.
చదవండి: అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్‌.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్‌ ఫోకస్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top