చేతులు కట్టేసి బాలిక హత్య
ఆస్తి వివాదాలే కారణమా?
చంచల్‌గూడ: అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఏడేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. మొదట బాలిక ఇంటి నుంచి తప్పిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు మంగళవారం మాదన్నపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం సదరు బాలిక అమ్మమ్మ ఇంట్లోని వాటర్ ట్యాంక్‌లో శవమై తేలింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు..
సంతోష్ నగర్‌కు చెందిన షబానా బేగం తన కుమార్తె (7)తో కలిసి మంగళవారం మధ్యాహ్నం యాఖుత్‌పురాలోని పుట్టింటికి వచ్చింది. బాలికను ఇంట్లోనే వదిలి షాపింగ్‌కు చారి్మనార్ వెళ్లింది. ఇంటికి తిరిగి వచి్చన తర్వాత కూతురు కనిపించకపోవడంతో అన్ని చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీలు వెతికినా ఫలితం లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు..
బాధితురాలి ఇంట్లో పరిశీలించగా వాటర్ ట్యాంక్‌లో శవమై కనిపించింది. బాలిక చేతులు వెనక నుంచి తాడు కట్టి ట్యాంక్‌లో పడేసి ఉండవచ్చిన పోలీసులు అనుమానిస్తున్నారు. కొంత కాలంగా బాధితురాలి తల్లి ఆస్తి విషయమై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో బాలికను లక్ష్యంగా చేసుకుని హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.