షేక్‌హ్యాండ్‌ ఇచ్చినా భయం లేదు

Security Agency Innovated Sanitizer Hand Gloves in Hyderabad - Sakshi

శానిటైజర్‌ హ్యాండ్‌ గ్లౌజ్‌కు రూపకల్పన 

జూబ్లీహిల్స్‌: షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినా కరోనా బారిన పడకుండా ఉండేలా శానిటైజ్‌ హ్యాండ్‌ గ్లౌజ్‌ను శ్రీనగర్‌ కాలనీకి చెందిన సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వాహకుడు కస్తూరి శివప్రసాద్‌ రూపొందించారు. బుధవారం ఆయన ఈ హ్యాండ్‌ గ్లౌజ్‌లను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు చూపించారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌ మాట్లాడుతూ కరోనా భయంతో కరెన్సీ నోట్లు పట్టుకునేందుకు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారన్నారు.

ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకుగాను శానిటైజ్‌ హ్యాండ్‌గ్లౌజ్‌లను తయారు చేసినట్లు తెలిపారు. ఈ హ్యాండ్‌ గ్లౌజ్‌లో సుమారు 50 ఎంఎల్‌ వరకు శానిటైజర్‌ ఉంటుందని షేక్‌హ్యాండ్‌ ఇచ్చిన ప్రతిసారి శానిటైజర్‌ విడుదల అవుతుందని అలా ప్రతిసారి గ్లౌజ్‌ వేసుకున్న ఏవి పట్టుకున్నా కూడా క్షణాల్లో శానిటైజ్‌ అవుతాయన్నారు. ఈ గ్లౌజ్‌లు పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, పోలీసులు, వ్యాపారస్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఒక్క జత గ్లౌజ్‌లు తయారు చేసేందుకు దాదాపు రూ.800 ఖర్చు అయినట్లు ఆయన వివరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top