ఆర్‌బీఐకి ‘ఎలుకలు కొరికిన కరెన్సీ’ | RBI Revises Rat Nibbled Currency Notes Of Mahabubabad Farmer | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐకి ‘ఎలుకలు కొరికిన కరెన్సీ’

Jul 20 2021 2:16 PM | Updated on Jul 20 2021 2:50 PM

RBI Revises Rat Nibbled Currency Notes Of Mahabubabad Farmer - Sakshi

మహబూబాబాద్‌ రూరల్‌: జిల్లాలోని మాను కోట మండలం ఇందిరానగర్‌ కాలనీకి చెందిన రైతు భూక్యా రెడ్యాకు చెందిన రూ. రెండు లక్షల విలువైన కరెన్సీ నోట్లను ఎలుకలు కొరికిన విషయం తెలిసిందే. దీంతో ఆ నోట్లను అధికారులు ఆర్‌బీఐకి పంపించారు. కలెక్టర్‌ గౌతమ్‌ ఆదేశాల మేరకు సోమవారం ఆ కరెన్సీ నోట్లను హైదరాబాద్‌లోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కార్యాలయానికి పంపి నట్లు తహసీల్దార్‌ రంజిత్‌కుమార్‌ తెలిపారు.

రైతు భూక్యా రెడ్యాతో పాటు వీఆర్‌ఏ కత్తుల రాజశేఖర్‌ను హైదరాబాద్‌కు పంపించి ఎలుకలు కొరికిన కరెన్సీ నోట్లను ఆర్‌బీఐ అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. తదుపరి ఆదేశాలు వచ్చాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement